హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: గువ్వలకు ఈ సారి కష్టమేనా?

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌లో కాస్త వివాదాలతో సహవాసం చేసే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది గువ్వల బాలరాజు అని చెప్పేయొచ్చు. ఈయన ఎన్ని రకాల వివాదాల్లో చిక్కుకున్నారో తెలిసిందే. ఈ మధ్య కూడా పోలీసులతో లొల్లి పెట్టుకున్నారు. అలాగే హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాట్లాడారు. ఇక ఈటల గెలవడంతో చాలామంది ఆయనకు డైరక్ట్‌గా ఫోన్ చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక వారిపై గువ్వల తిట్ల వర్షం కురిపించారు. అలా వివాదాల్లో ఉంటూ వస్తున్న గువ్వల..అచ్చంపేట ఎమ్మెల్యేగా ఎలా పనిచేస్తున్నారు...వరుసగా రెండుసార్లు గెలుస్తూ వచ్చిన గువ్వల...అచ్చంపేట ప్రజలకు అండగా ఉంటున్నారో లేదా? అనే విషయాలని ఒక్కసారి గమనిస్తే... అసలు గువ్వల బాలరాజు తొలిసారి...టీఆర్ఎస్ తరుపున 2009 ఎన్నికల్లో నాగర్‌కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

 
ఇక 2014, 2018 ఎన్నికల్లో వరుసగా అచ్చంపేట నుంచి విజయం సాధించారు. గువ్వల గెలిచిన రెండుసార్లు టీఆర్ఎస్ అధికారంలోకి ఉంది. మరి అధికార పార్టీ ఎమ్మెల్యేగా అచ్చంపేటని ఏమన్నా అభివృద్ధి చేశారా? అంటే పెద్దగా లేదనే సమాధానాలు నియోజకవర్గ ప్రజల నుంచి వస్తున్నాయి. అయితే అనుకున్న మేర కాకపోయినా..కొంతమేర అభివృద్ధి నడుస్తోంది. అచ్చంపేట మున్సిపాలిటీలో అభివృద్ధి బాగానే ఉంది. అలాగే సాగునీరు, తాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. రోడ్ల సౌకర్యం కూడా బాగానే ఉంది.
అయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంగా మారాక కాస్త అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు పనులు దొరుకుతున్నాయి. కాకపోతే పనులు కోసం వచ్చి..రాత్రి సమయంలో ఇళ్లకు తిరిగి వెళ్లలేని వారికి జిల్లా కేంద్రంలో నిరాశ్రయుల కేంద్రం నిర్మించాల్సి ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేసింది...కానీ అధికారులు స్థలం కేటాయించకుండా సమయం గడిపేస్తున్నారు.
అలాగే అచ్చంపేటలో పాలిటెక్నిక్‌ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి.. నిరుద్యోగులకు అండగా ఉండాల్సిన అవసరముంది. నియోజకవర్గంలో ఎనిమిది మండలాలకు మూడు జూనియర్ కాలేజీలు, రెండు డిగ్రీ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. పీజీ కాలేజ్ లేదు. అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పేదలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దళితులకు మూడు ఎకరాల హామీ నెరవేరలేదు. అలాగే ఇక్కడ ఫారెస్ట్ భూములని సాగు చేసుకుంటున్న గిరిజనులకు సరైన న్యాయం జరగడం లేదు. గిరిజన గ్రామాల్లో స్వచ్చమైన తాగునీరు దొరకడం కష్టం. ఇలా అచ్చంపేటలో అనేక సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
రాజకీయంగా వస్తే గువ్వల బలం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజలు ఈ సారి ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేలా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో గువ్వల పరిస్తితి ఏం అవుతుందో
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: