హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కరణంతో క్లారిటీ లేదా?

ఏపీలో కొందరు నాయకులు చాలా న్యూట్రల్‌గా రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అంటే ఎప్పుడు ఏ విధంగా రాజకీయం మారుతుందో చెప్పలేని పరిస్తితి ఉండటం వల్ల అనుకుంటా...కొందరు న్యూట్రల్‌గానే ఉంటున్నట్లు కనిపిస్తోంది. ఉదాహరణకు టీడీపీలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు..వారు పూర్తిగా టీడీపీలో దూకుడుగా ఉండటం లేదు. ఏదో తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. అలాగే తమ ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీపై విమర్శలు కూడా చేయరు. ఇలా వైసీపీలో కూడా కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు.
మిగతా వైసీపీ నేతలు ఎన్ని రకాలుగా చంద్రబాబుని తిట్టినా...కొందరు మాత్రం అసలు స్పందించరు. తమ నియోజకవర్గాలకే పరిమితమై పనులు చేసుకుంటారు తప్ప...రాజకీయ పరమైన విమర్శల జోలికి వెళ్ళరు. అలా వైసీపీలో కరణం బలరాం ఉన్నారు. ఈయన టీడీపీ నుంచి గెలిచే వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే ఈయనతో పాటు వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్‌లు కూడా టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చారు. ఇందులో వంశీ, గిరిలు...చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
కానీ వాసుపల్లి, కరణంలు కాస్త న్యూట్రల్‌గా ఉంటున్నారు. అసలు కరణం...చంద్రబాబు సన్నిహితుడే అని సంగతి తెలిసిందే. దశాబ్దాల పాటు టీడీపీలో పనిచేశారు. కానీ గత ఎన్నికల తర్వాత వైసీపీలోకి వచ్చారు. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో కరణం...నియోజకవర్గంలో కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు. అలాగే ఆయనకు వ్యాపార పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎమ్మెల్యేగా తనకు సాధ్యమైన మేర పనులు చేసుకుంటూ వెళుతున్నారు.
వైసీపీ వైపు ఉన్నా సరే ఎప్పుడూ చంద్రబాబుని విమర్శించలేదు. అంటే నెక్స్ట్ పరిస్తితులని బట్టి కరణం రాజకీయం చేసేలా ఉన్నారు. ఇటు ఆమంచి కృష్ణమోహన్ ఎలాగో చీరాల సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. దీంతో కరణం, ఆమంచిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మరి నెక్స్ట్ ఎన్నికల్లో కరణం రాజకీయం ఎలా ఉంటుందో క్లారిటీ రావడం లేదు. ఆయన మళ్ళీ వైసీపీలోనే పోటీకి దిగుతారా? లేక టీడీపీలోకి వచ్చేస్తారా? అనేది తెలియడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: