హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: నెంబర్ 2 ఎమ్మెల్యేకు ఈ సారి టఫ్ ఫైట్ తప్పదా...

గత ఎన్నికల్లో ఎవరికి అత్యధిక మెజారిటీ వచ్చిందో అందరికీ తెలుసు. జగన్‌కు పులివెందులలో దాదాపు 90 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇదే గత ఎన్నికల్లో హయ్యెస్ట్ మెజారిటీ. మరి జగన్ తర్వాత అత్యధిక మెజారిటీ తెచ్చుకున్న ఎమ్మెల్యే ఎవరో తెలుసా? ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు.  గిద్దలూరు నుంచి రాంబాబు వైసీపీ తరుపున పోటీ చేసి, టీడీపీ అభ్యర్ధి అశోక్ రెడ్డిపై దాదాపు 81 వేల పైనే మెజారిటీతో గెలిచారు.
అయితే రాంబాబు 2009లో ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన 2014లో టి‌డి‌పి తరుపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు వైసీపీ నుంచి గెలిచిన అశోక్ రెడ్డి టి‌డి‌పిలోకి రావడంతో అన్నా రాంబాబు వైసీపీలోకి జంప్ చేశారు. ఇక 2019 ఎన్నికల్లో రాంబాబు భారీ మెజారిటీతో గెలిచారు. మరి ఇంత భారీ మెజారిటీతో గెలిచిన రాంబాబు...గిద్దలూరు ప్రజలకు అంతే భారీగా అండగా ఉంటున్నారా? అంటే అంతగా లేదనే తెలుస్తోంది.
ఎమ్మెల్యేగా రాంబాబు తనకు సాధ్యమైన పనులు చేసుకుంటూ వెళుతున్నారు. ప్రభుత్వం తరుపున జరిగే అభివృద్ధి, సంక్షేమ పథకాలు గిద్దలూరులో జరుగుతున్నాయి. అయితే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అనుకున్న మేర జరగడం లేదు. పైగా ఎమ్మెల్యేలకు నిధులు సైతం పెద్దగా రాకపోవడం వల్ల, రాంబాబు అనుకున్న పనులు చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.
ఇక రాంబాబు మరీ వన్‌సైడ్‌గా వెళుతున్నట్లు కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఈయనకు ఎదురుచెబితే ఇబ్బందులు తప్పవనేలా పరిస్తితులు ఉన్నాయి. మొన్న ఆ మధ్య ఓ జనసేన కార్యకర్త రాంబాబుని ప్రశ్నిస్తే ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. దీంతో రాంబాబుపై పవన్ కూడా తీవ్రంగా ఫైర్ అయ్యారు. తమ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణం రాంబాబు అని ఆందోళనలు చేశారు. ఇక నియోజకవర్గంలో వైసీపీ నేతల అక్రమాలు ఎక్కువగానే ఉన్నాయని టి‌డి‌పి, జనసేనలు ఆరోపిస్తున్నాయి. నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి...రోడ్ల పరిస్తితి మరీ దారుణంగా ఉంది. అటు తాగునీరు, సాగునీరు ఇక్కట్లు ఉన్నాయి. ఇక్కడ మిర్చి రైతులకు సరైన గిట్టుబాటు ధర దొరకడం లేదు.


రాజకీయంగా చూసుకుంటే రాంబాబు స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అటు టి‌డి‌పి నేత అశోక్ రెడ్డి కూడా నిదానంగా పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఆయన దూకుడుగా ఉంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాంబాబుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇక్కడ జనసేనకు పెద్దగా బలం లేదనే చెప్పొచ్చు. ఏదేమైనా రాంబాబు, అశోక్‌ల మధ్య ఈ సారి టఫ్ ఫైట్ ఉండేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: