హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో ఉప్పలపాటికి ఈ సారి టఫ్‌గా ఉంటుందా?

విశాఖపట్నంలో మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పొచ్చు. జిల్లాలో పలు నియోజకవర్గాలు టి‌డి‌పికి కంచుకోటలుగా ఉన్నాయి. అలా టి‌డి‌పికి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో ఎలమంచిలి కూడా ఒకటి. 1983 నుంచి 1999 వరకు వరుసగా అయిదుసార్లు ఎలమంచిలిలో టి‌డి‌పి జెండా ఎగిరింది.
కానీ 2004, 2009 ఎన్నికల్లో ఎలమంచిలిలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ తరుపున ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు(కన్నబాబు) విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో టి‌డి‌పి తరుపున పంచకర్ల రమేష్ బాబు పోటీ చేయగా, వైసీపీ తరుపున కన్నబాబు పోటీ చేశారు. కానీ విజయం పంచకర్లని వరించింది. 2019 ఎన్నికల్లో పంచకర్లపై కన్నబాబు పైచేయి సాధించారు.
మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచేశారు. మూడోసారి గెలవడంతో మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేగా కన్నబాబు దూకుడుగానే పనిచేస్తున్నారు. ఎలమంచిలిలో ప్రభుత్వం తరుపున జరిగే అన్నీ సంక్షేమ, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేగా కన్నబాబురాజు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండరనే ప్రచారం ఉంది. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో తాగు, సాగు నీరు సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. పోలవరంపై నిర్మిస్తున్న ఆనకట్ట పూర్తి అయితే ఈ సమస్యలు ఉండవు. అచ్చుతాపురం మండలంలో ఉన్న పలు కర్మాగారాల వల్ల సముద్రపు నీరు కలుషితమవుతుంది. ఎలమంచిలి మున్సిపాలిటీలో రోడ్ల విస్తరణ చేయాల్సి ఉంది. తుమ్మపాల సహకార చక్కెర కర్మాగారాన్ని కాపాడాల్సిన అవసరముంది.
ఇటు రాజకీయంగా వస్తే కన్నబాబుకు ఎమ్మెల్యేగా ఎవరేజ్ మార్కులు పడుతున్నాయి. అటు టి‌డి‌పి తరుపున పోటీ చేసిన పంచకర్ల రమేష్ వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో ఎలమంచిలి టి‌డి‌పి ఇంచార్జ్‌గా ప్రగడ నాగేశ్వరరావు పనిచేస్తున్నారు. ఈయన పెద్దగా దూకుడుగా ఉండటం లేదు. అయితే ఇక్కడ జనసేన తరుపున సుందరపు విజయ్ కుమార్ దూకుడుగా పనిచేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ జనసేన-టి‌డి‌పిలు కలిస్తే వైసీపీకి చెక్ పడిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: