హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు సెకండ్ ఛాన్స్ లేదా?

గత ఎన్నికల్లో కేవలం జగన్ ఇమేజ్‌తో గెలిచిన ఎమ్మెల్యేల్లో...కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ కూడా ఒకరు. 2014 ఎన్నికల్లో కోడుమూరులో వైసీపీ తరుపున మణిగాంధీ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత టీడీపీలోకి వెళ్లారు. దీంతో జగన్, సుధాకర్‌కు కోడుమూరు వైసీపీ బాధ్యతలు అప్పగించారు. మళ్ళీ మణిగాంధీ వైసీపీలోకి తిరిగొచ్చిన జగన్ మాత్రం సుధాకర్‌కే టికెట్ ఇచ్చారు. దీంతో జగన్ వేవ్‌లో సుధాకర్ దాదాపు 36 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు.
ఇంత భారీ మెజారిటీతో గెలిచిన సుధాకర్..అంతే భారీగా కోడుమూరు ప్రజలకు సేవ చేయడంలో కాస్త వెనుకబడి ఉన్నట్లే కనిపిస్తోంది. స్థానికంగా సుధాకర్ అందుబాటులోనే ఉంటున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలని ప్రచారం చేస్తూ, అర్హులైన వారికి అందించే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం తరుపున పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ప్రభుత్వ కార్యక్రమాలు మినహా కోడుమూరులో కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా కనిపించడం లేదు.
కాకపోతే ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని మాత్రం బాగానే ప్రచారం చేసుకుంటున్నారు. అటు ప్రజా సమస్యలని బాగానే తెలుసుకుంటున్నారు గానీ, ఆ సమస్యలని పరిష్కరించడంలో మాత్రం ఎమ్మెల్యే వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఇటీవల వస్తున్న కొన్ని సర్వేల్లో కూడా ఎమ్మెల్యే పనితీరు పట్ల అక్కడి ప్రజలు పెద్దగా సంతృప్తిగా లేరని తేలింది. నియోజకవర్గంలో సుధాకర్‌కు ఎదురుగాలి వీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు. చేనేత వారికి ప్రభుత్వం సంవత్సరానికి రూ.24 వేలు సాయం చేస్తుంది. అయితే ఈ సాయం కొంతవరకు చేనేత కార్మికులకు అండగా ఉంటుంది. కాకపోతే పూర్తి స్థాయిలో ఇక్కడ వారి సమస్యలు మాత్రం తీరడం లేదు. అలాగే కోడుమూరులో తాగునీరు, సమస్యలు ఉన్నాయి. ఇక రాజకీయంగా చూసుకుంటే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే మీద వ్యతిరేకిత పెరుగుతుంది గానీ, ఆ వ్యతిరేకితని ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో టీడీపీ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: