హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీకి ఛాన్స్ ఇవ్వని బాషా...

చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న విషయం తెలిసిందే. అవ్వడానికి చంద్రబాబు సొంత జిల్లా అయినా సరే ఇక్కడ పూర్తిగా వైసీపీ హవా కొనసాగుతుంది. ముఖ్యంగా మదనపల్లే నియోజకవర్గంలో వైసీపీకి తిరుగులేకుండా పోతుంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ నవాజ్ బాషా నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటూ, వారికి అండగా నిలబడుతున్నారు.


2019 ఎన్నికల్లో మదనపల్లె బరిలో దిగి భారీ మెజారిటీతో గెలిచిన బాషాకు నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ పెరిగింది. రెండేళ్లలో బాషా పనితీరు మెరుగైంది. సమస్య ఉందని వచ్చే ప్రజలకు అండగా నిలబడుతున్నారు. పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తున్నారు. రెండేళ్లలో వివాదాలు జోలికి అసలు వెళ్లని బాషా, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు బాగానే చేయిస్తున్నారు.
నాడు-నేడు కార్యక్రమం ద్వారా మదనపల్లెలో ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి. అటు జగనన్న కాలనీలు పేరిట మదనపల్లెలో పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే కొత్తగా రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణాలు జరిగాయి. ప్రభుత్వ పథకాలు మహమ్మద్ నవాజ్ బాషాకు బాగా ప్లస్ అవుతున్నాయి. అటు కరోనా సమయంలో బాషా ప్రజలకు సాయం చేసుకుంటూ వచ్చారు.
మదనపల్లె టమోటో రైతులకు సరైన గిట్టుబాటు ధర అందడం లేదు. అలాగే ఇక్కడ మామిడి రైతుల పరిస్తితి కూడా అంతే. అలాగే మదనపల్లెలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. రోడ్లని విస్తరించాల్సిన అవసరముంది. ఇంకా తాగునీరు, సాగునీరు సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సమస్యలని పరిష్కరించాల్సిన అవసరముంది.
రాజకీయంగా మదనపల్లె లో మహమ్మద్ నవాజ్ బాషా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక బాషాకు చెక్ పెట్టడానికి టీడీపీ నేత రమేష్ గట్టిగానే కష్టపడుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ తరుపున యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. రమేష్ ఎంతకష్టపడిన ప్రస్తుతం ఇక్కడ బాషాకే లీడింగ్ కనిపిస్తోంది. మొత్తానికైతే మదనపల్లెలో టీడీపీకి బాషా ఛాన్స్ ఇవ్వడం లేదనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: