హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు నెగిటివ్ ఎక్కువే...కానీ

వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు అంతా అద్భుత పనితీరు కబరుస్తున్నారా? అంటే అలా లేదనే గట్టిగా చెప్పొచ్చు. వైసీపీ తరుపున గెలిచిన 151 మంది ఎమ్మెల్యేల్లో సగం మంది మంచి పనితీరు కనబర్చడంలో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. అలాగే కొందరు ప్రజల పనులని చక్కబెట్టడం కంటే, సొంత పనులని చక్కబెట్టుకోవడంలోనే ముందున్నారని విమర్శలు వస్తున్నాయి. కాకపోతే జగన్ ఇమేజ్, పథకాల ఉండటం వల్ల అలాంటి ఎమ్మెల్యేలకు పెద్దగా నెగిటివ్ ప్రభావం ఉండటం లేదని తెలుస్తోంది.
అలా జగన్ ఇమేజ్‌ మాత్రమే ప్లస్ అవుతున్న ఎమ్మెల్యేల్లో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ కూడా ఉన్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేగా పర్వత అంత గొప్ప పనితీరు కనబర్చడం లేదని టాక్. ప్రభుత్వం తరుపున చేసే కార్యక్రమాలే తప్ప, ఈయన నియోజకవర్గంలో కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని టీడీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి.
అలాగే ఎమ్మెల్యే అనుచరులు పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజలు పనులని చక్కబెట్టడం కంటే, తమపై అక్రమ కేసులు పెట్టడంలో ఎమ్మెల్యే ముందున్నారని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఇక ఇక్కడ టీడీపీ తరుపున వరుపుల రాజా పనిచేస్తున్నారు. ఇక్కడ ఈయనదొక వింత తీరు అని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈయన టీడీపీ టికెట్ తీసుకుని ప్రత్తిపాడు బరిలో పోటీ చేసి, స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు.
ఓడిపోయాక పార్టీ కోసం పనిచేయకుండా, ఇక్కడ తగిన న్యాయం జరగలేదని చెప్పి రాజా, టీడీపీకి రాజీనామా చేసేశారు. అలాగే చంద్రబాబుపై విమర్శలు చేశారు. అలా చేసిన రాజా మళ్ళీ టీడీపీలోకి వచ్చి ప్రత్తిపాడులో పనిచేస్తున్నారు. ఇలా పార్టీని వీడి, మళ్ళీ పార్టీలోకి రావడం వల్ల రాజాని సొంత కార్యకర్తలే నమ్మడం లేదు. అలాగే ఈయన ఇక్కడ పార్టీని బలోపేతం చేయలేదు. దీంతో ఎమ్మెల్యేకు బాగా ప్లస్ అవుతుంది. టీడీపీ వీక్‌గా ఉండటం, జగన్ ఇమేజ్ వల్ల ఎమ్మెల్యేకు కలిసొస్తుందని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: