హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఈసారి రాజన్నకు ఫిక్స్ అవుతుందా?

పీడిక రాజన్న దొర...విజయనగరం జిల్లాలో కీలక నాయకుడు. కాంగ్రెస్‌లో రాజకీయం జీవితం మొదలుపెట్టిన రాజన్న... 2004లో సాలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2009లో అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన రాజన్న, నెక్స్ట్ జగన్‌కు అండగా ఉండటానికి వైసీపీలోకి వచ్చేశారు.


2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన కూడా రాజన్న మాత్రం జగన్‌ని వదల్లేదు. వైసీపీలోనే కొనసాగి 2019 ఎన్నికల్లో మళ్ళీ సాలూరు బరిలో సూపర్ విక్టరీ కొట్టారు. అయితే జగన్ ఆప్తుడుగా ఉండటంతో మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా బొత్స సత్యనారాయణ, రాజన్నకు పదవి రాకుండా అడ్డుకున్నారని టాక్. గిరిజన మంత్రిగా జూనియర్ అయిన పుష్పశ్రీవాణికి దక్కేలా చేశారు.


మంత్రి పదవి రాకపోయిన రాజన్న ప్రజలకు సేవ చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ...సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అయితే రాజన్నకు వచ్చే విడతలో మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ అండ పుష్కలంగా ఉండటంతో ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో రాజన్నకు ఛాన్స్ రావొచ్చని ప్రచారం జరుగుతుంది.


ఇక రాజకీయంగా సాలూరులో రాజన్న బలంగా ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ టీడీపీ వీక్‌గానే ఉంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. అలాగే నిత్యం ప్రజల్లో ఉంటున్న రాజన్న, వారికి ప్రభుత్వ పథకాలు అందించడంలో ఎలాంటి లోటు చేయడం లేదు. రాష్ట్రంలో విజయవాడ తరువాత అత్యదిక లారీలు ఉన్న ప్రాంతం సాలూరు. ఇక్కడ ప్రజలు ప్రధానంగా లారీ పరిశ్రమపై ఎక్కువగా ఆదారపడి ఉన్నారు.


పువ్వుల వ్యాపారంలో సాలూరు అగ్ర స్థానంలో ఉంది. మల్లెపువ్వులు ఎక్కువ దిగుబడి అవుతాయి. అయితే ఇక్కడ ఉద్యాన, ప్లోరికల్చర్ అభివృద్ధికి అనువైన పరిశోధనా కేంద్రాలు స్థాపించి, పువ్వులనుండి తయారయ్యే ఉత్పత్తులు ప్రోత్సహిస్తే, స్థానికుల ఉఫాధి అవకాశాలు మెరుగుపడతాయి. తాగునీటి సమస్య, పారిశుద్య్యం, విద్యుత్తు సరఫరాలు మెరుగుపరచాలి.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: