హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జోగికి ఊహించని షాకులు..పవన్‌తో కష్టమే...
ఈ క్రమంలోనే వైఎస్సార్ 2009లో జోగికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. కాకపోతే సొంత నియోజకవర్గం మైలవరం కాకుండా...పెడన బరిలో దింపారు. అయితే తొలిసారి బరిలో దిగిన..తన సత్తా చాటుతూ టీడీపీ సీనియర్ నేత కాగిత వెంకట్రావుని చిత్తు చేశారు. అప్పుడు ప్రజారాజ్యం ఓట్లు చీల్చేయడం టీడీపీకి పెద్ద మైనస్ అయ్యి, జోగికి ప్లస్ అయింది.
ఇక ఆ తర్వాత వైఎస్సార్ మరణం, జగన్ సెపరేట్ పార్టీ పెట్టడంతో, జోగి ఎమ్మెల్యే పదవి కూడా వదులుకుని జగన్ వైపు నడిచారు. ఇక 2014 ఎన్నికల్లో జగన్ మైలవరం టికెట్ ఇవ్వడంతో జోగి అటు వెళ్ళిపోయారు. ఆ ఎన్నికల్లో దేవినేని ఉమా చేతిలో స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు.
2019 ఎన్నికలకొచ్చేసరికి జోగి...మళ్ళీ పెడన బరిలో దిగి విజయం సాధించి....రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఇప్పుడు కూడా జనసేన ఓట్లు చీల్చేయడంతో టీడీపీకి మైనస్ అయింది. జోగికి ప్లస్ అయింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న జోగి, టీడీపీ మీద, ఆ పార్టీ అధినేత చంద్రబాబు మీద విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. తమ ప్రభుత్వం మీదగానీ, సీఎం జగన్ మీదగానీ టీడీపీ వాళ్ళు విమర్శలు చేస్తే అసలు ఊరుకోరు. వెంటనే కౌంటర్లు ఇచ్చేస్తారు.
అయితే ఇంత టీడీపీ అంటే ఇంత ఫైర్ చూపించే జోగి, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో కాస్త వెనకబడే ఉన్నారు. సంక్షేమ పథకాల అమలులో టాప్‌లో ఉంటే, అభివృద్ధి విషయంలో లాస్ట్‌లో ఉన్నారు. ఇక పంచాయితీ ఎన్నికల్లో జోగికి కాస్త కష్టకాలం మొదలయ్యేలా ఉంది. ఎందుకంటే నియోజకవర్గంలో టీడీపీ పుంజుకున్నట్లు కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో ఓడిపోయిన కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్ యాక్టివ్గానే ఉన్నారు. అలాగే మెజారిటీ పంచాయితీల్లో టీడీపీకి బలం ఉంది. ఇదే సమయంలో జోగికి పవన్ కల్యాణ్ పార్టీ నుంచి కూడా షాక్ తగిలేలా ఉంది. పెడనలో కాపులు ఎక్కువగానే ఉన్నారు. చాలా పంచాయితీల్లో జనసేన అభ్యర్ధులు బరిలో ఉండేదుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టీడీపీ, జనసేనకు సపోర్ట్ ఇస్తుంది.
ఇలా రెండు పార్టీలు కలిసి జోగికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి బరిలో ఉంటే వైసీపీ గెలుపు కష్టమయ్యేది. మరి ఇప్పుడు పంచాయితీల్లో కొన్నిచోట్ల కలుస్తున్నారు. ఇక ఇప్పుడు పెడనలో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.