హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జూనియర్ ఎమ్మెల్యేకు సీనియర్ నేత చెక్ పెట్టగలరా?

అధికార వైసీపీలో చాలామంది యువ ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి పలువురు యువ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అలా గెలిచిన వారిలో వెంకటేగౌడ కూడా ఒకరు. పలమనేరు నుంచి తొలిసారి పోటీ చేసిన వెంకటే..టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. దాదాపు 32 వేల ఓట్ల పైనే మెజారిటీతో వెంకటే గెలిచి సత్తా చాటారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గౌడ, నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు. యువకుడు కావడంతో నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

ఇక ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి లోటు రానివ్వడం లేదు. అలాగే నియోజకవర్గంలో కొత్తగా సిసి రోడ్లు, అండర్ డ్రైనేజ్, వంతెనలు, సచివాలయ నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే దూకుడుగా పనిచేస్తున్న వెంకటే చుట్టూ వివాదాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో కొన్ని వివాదాలు వచ్చాయి.

ఇక ఇక్కడ పథకాలు అమలు బాగానే ఉంది. పథకాలు ఎమ్మెల్యేకు ప్లస్ అవుతున్నాయి. అలాగే పలు సమస్యలు కూడా ఉన్నాయి. రోడ్లని అభివృద్ధి చేయాలసిన అవసరముంది. తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఇక ఇక్కడ టీడీపీని అమర్నాథ్ రెడ్డి నడిపిస్తున్నారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్, తర్వాత టీడీపీలోకి వచ్చి మంత్రి అయ్యారు. మంత్రిగా నియోజకవర్గంలో మంచిగానే అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ప్రతిపక్షంలోనే ఉంటూ, ప్రజల తరుపున పోరాడుతున్నారు

అయితే ఈ మధ్య అమర్నాథ్ బాగా పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అయితే ఇలాగే అమర్నాథ్ కొనసాగితే భవిష్యత్‌లో జూనియర్ ఎమ్మెల్యే అయిన వెంకటే గౌడ కు చెక్ పెట్టె అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: