హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ నియోజకవర్గాన్ని వైఎస్సార్‌సీపీ కంచుకోటగా మార్చేస్తున్నారుగా..!
అయితే ఇదే ఆదిమూలం 2014 ఎన్నికల్లో కేవలం 4 వేల ఓట్ల తేడాతో అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసిన తలారి ఆదిత్యపై ఓడిపోయారు. ఓడిపోయాక పార్టీని వదలకుండా నియోజకవర్గంలో కష్టపడి పనిచేయడం వల్ల, 2019 ఎన్నికల్లో సీటు దక్కించుకుని ఆదిమూలం అదిరిపోయే మెజారిటీతో గెలవగలిగారు. ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుకుంటూ, నియోజకవర్గంలో పనులు చేయించుకుంటున్నారు.
ఇక ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దాసుకుప్పం బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు. దాసుకుప్పం బైపాస్ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టి, త్వరితగతిన పూర్తిచేయాలని ఆదిమూలం, జగన్‌ని కోరారు. దీని పై సీఎం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దాసుకుప్పం బైపాస్ పనులు మొదలయ్యే అవకాశముంది. అటు నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన నాడు-నేడు కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది.
ఇంకా ప్రభుత్వం పథకాలు ప్రజలకు సజావుగా అందుతున్నాయి. ఈ విధంగా నియోజకవర్గంలో పనులు చేస్తూ...ఆదిమూలం రోజురోజుకూ బలపడుతున్నారు. అసలు ఇక్కడ టీడీపీ అడ్రెస్ లేదనే చెప్పొచ్చు. ఆ పార్టీకి సరైన నాయకత్వం లేక ఇబ్బందులు పడుతోంది. ఎన్నికల్లో ఓటమి పాలైన జడ్డ రాజశేఖర్ యాక్టివ్‌గా లేనట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ కేడర్ వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిపోతుంది. ఇదే ఆదిమూలంకు అడ్వాంటేజ్ అవుతుంది. మొత్తానికి టీడీపీకి అనుకూలంగా ఉన్న సత్యవేడుని ఆదిమూలం వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మార్చేశారు.