హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: సబితమ్మ వారసుడుకు ఛాన్స్ ఇస్తారా?

సబితా ఇంద్రారెడ్డి...ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయక్కర్లేదనే చెప్పాలి..రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సబితా ఇంద్రారెడ్డి గురించి తెలుసు..అలాగే దివంగత వైఎస్సార్...సబితమ్మని చేవెళ్ళ చెల్లెమ్మ అంటూ ఆప్యాయంగా పిలిచిన సందర్భం తెలుసుగా..అలాగే ఆమెకు హోమ్ మంత్రి పదవి ఇచ్చిన విషయం తెలిసిందే..ఇలా తెలుగు ప్రజలకు సుపరిచితమైన సబితా రాజకీయాల్లోకి ఎలా వచ్చారో కూడా తెలిసిందే.
సబితా భర్త ఇంద్రారెడ్డి గతంలో టీడీపీలో పనిచేశారు..1985, 1989, 1994 ఎన్నికల్లో చేవెళ్ళ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు..తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్ళి 1999 ఎన్నికల్లో గెలిచారు..తర్వాత అనూహ్యంగా మరణించడంతో సబితమ్మ రాజకీయాల్లోకి వచ్చారు. 2000 చేవెళ్ళ ఉపఎన్నికలో పోటీ చేసి గెలిచారు..అలాగే 2004 ఎన్నికల్లో కూడా సత్తా చాటారు..వైఎస్సార్ క్యాబినెట్‌లో హోమ్ మంత్రిగా పనిచేశారు..2009లో మహేశ్వరం నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు.
ఇక 2014లో సబితమ్మ మహేశ్వరం బరిలో ఓడిపోగా, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి చేవెళ్ళ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు..2018 ఎన్నికలోచ్చేసరికి సబితమ్మ మరొకసారి మహేశ్వరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు..కానీ తర్వాత ఆమె కాంగ్రెస్‌ని వదిలి టీఆర్ఎస్‌లో చేరిపోయారు..అలాగే కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు..మంత్రిగా ఆమె దూసుకెళుతున్నారు..అయితే వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం సీటులో తన కుమారుడు కార్తీక్‌ని దించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఒకవేళ రెండు సీట్లు ఇస్తే ఓకే లేదంటే సబితమ్మ సైడ్ అయ్యి..తన వారసుడుకు సీటు ఇప్పించుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
అదే సమయంలో మహేశ్వరం టీఆర్ఎస్ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా ట్రై చేస్తున్నారు...గత ఎన్నికల్లో ఈయన టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి సబితాపై ఓడిపోయారు. సబితమ్మ టీఆర్ఎస్‌లోకి రావడంతో తీగలకు రాజకీయంగా ఇబ్బంది అయింది..అయితే ఈయన కూడా సీటు కోసం చూస్తున్నారు..కానీ మహేశ్వరం సీటు మాత్రం సబితా ఫ్యామిలీకే దక్కేలా ఉంది..ఇక ఫ్యామిలీ నుంచి సబితమ్మ పోటీ చేస్తుందో లేక..కార్తీక్ పోటీ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: