హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: సాయన్న సీటుకు ఎర్త్?

ఒకప్పుడు హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీకి ఎంత పట్టు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు...అక్కడ పలుమార్లు టీడీపీ సత్తా చాటింది...ఇక టీడీపీలో రాజకీయ జీవితం మొదలుపెట్టి, ఆ పార్టీ ద్వారా ఎదిగిన నేతలు చాలామంది ఉన్నారు..అలా టీడీపీ ద్వారా రాజకీయంగా ఎదిగిన వారిలో సాయన్న కూడా ఒకరు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సాయన్న...సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ సత్తా చాటుతూ వచ్చారు.
1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా కంటోన్మెంట్ నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు...అయితే 2009 ఎన్నికల్లో సాయన్న ఓటమి పాలయ్యారు. తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికల్లో మరోసారి టీడీపీ తరుపున కంటోన్మెంట్ బరిలో దిగి విజయం సాధించారు...అయితే తెలంగాణలో టీడీపీ పరిస్తితి ఘోరంగా తయారవ్వడంతో సాయన్న..టీడీపీని వదిలి, టీఆర్ఎస్‌లో చేరారు.
ఇక 2018 ఎన్నికల్లో సాయన్న టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి...ఐదోసారి కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్నకు కంటోన్మెంట్‌పై బాగా పట్టు ఉంది...నియోజకవర్గంలో ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువే. అలాగే అక్కడ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటారు..ఇక నగర పరిధిలో ఉండటంతో కంటోన్మెంట్ బాగానే అభివృద్ధి చెందింది. అయితే ఇక్కడ చిన్నాచితక సమస్యలు ఉన్నాయి...తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి...పలు కాలనీల్లో రోడ్లు, డ్రైనేజ్ ఇష్యూ ఉంది.
రాజకీయంగా చూసుకుంటే ఇక్కడ సాయన్నకు ఎదురులేదనే చెప్పొచ్చు...సాయన్నని మించిన బలమైన నాయకుడు కంటోన్మెంట్‌లో ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీలో సర్వే సత్యనారాయణ ఉన్నారు గాని..ఆయనకు కంటోన్మెంట్‌పై పెద్ద పట్టు లేదు..ఇక్కడ బీజేపీకి పట్టు తక్కువే. అయితే వచ్చే ఎన్నికల్లో సాయన్నకు టీఆర్ఎస్ టికెట్ దక్కుతుందో లేదో క్లారిటీ లేదు...కంటోన్మెంట్ సీటు కోసం టీఆర్ఎస్ నేతలు గజ్జెల నగేష్, క్రిశాంక్ ట్రై చేస్తున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో కంటోన్మెంట్ సీటు ఎమ్మెల్యే సాయన్నకు దక్కుతుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: