హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దానంకు బ్రేకులు లేవా?

దానం నాగేందర్...తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కరలేని పేరు..ఎన్నో ఏళ్ల నుంచి తెలంగాణలో రాజకీయం చేస్తున్న నాయకుడు..మొదట కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన దానం..తక్కువ కాలంలోనే బలమైన నాయకుడుగా ఎదిగారు..ఇక 1994, 1999 ఎన్నికల్లో హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు..రెండుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు.
కానీ 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్‌ని వదిలి టీడీపీలో చేరి..ఆసిఫ్‌నగర్‌లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు..అయితే అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో...టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దానం..వైఎస్సార్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఈ క్రమంలోనే 2004లోనే ఆసిఫ్‌నగర్ ఉపఎన్నిక రాగా, అప్పుడు దానం కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎం‌ఐ‌ఎం చేతిలో ఓడిపోయారు...అనవసరంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దానం ఓటమి పాలయ్యారు.
ఇక 2009 ఎన్నికలోచ్చేసరికి దానం..ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు..అలాగే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం ఉద్యమం చేసేవారిపై దానం విరుచుకుపడిన విధానం అందరికీ గుర్తుందనే చెప్పాలి..అసలు దానం లాఠీ పట్టుకుని ఉద్యమకారులని చెదరగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికల్లో మళ్ళీ ఖైరతాబాద్ బరిలో దిగి బీజేపీ చేతిలో ఓడిపోయారు..ఆ తర్వాత దానం టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఖైరతాబాద్‌లో విజయం సాధించారు.
ఇలా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం...అధికార పార్టీ ఎమ్మెల్యేగా దూకుడుగానే పనిచేస్తున్నారు...ఖైరతాబాద్ ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతమనే సంగతి తెలిసిందే..జి‌హెచ్‌ఎం‌సి పరిధిలో ఉన్న ఖైరతాబాద్‌లో మంచి అభివృద్ధే జరిగింది.అలాగే ఇక్కడ కొన్ని కాలనీల్లో నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య ఉంది...ఇక వానాకాలం మునిగిపోయే పరిస్తితి.
రాజకీయంగా చూస్తే ఖైరతాబాద్‌లో దానంకు తిరుగులేదనే చెప్పాలి...కానీ ఇక్కడ బీజేపీ కూడా బలమైన పార్టీగా ఉంది..చింతల రామచంద్రారెడ్డి కూడా పుంజుకుంటున్నారు...అటు కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ సైతం బలమైన నాయకుడే. అంటే నెక్స్ట్ ఖైరతాబాద్‌లో పోటీ రసవత్తరంగా ఉంటుందనే చెప్పొచ్చు. మరి నెక్స్ట్ దానం గెలుపుకు ఎవరైనా బ్రేక్ వేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: