హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మాగంటికి హ్యాట్రిక్ ఛాన్స్?

ఒకప్పుడు హైదరాబాద్ పరిధిలో తెలుగుదేశం పార్టీకి ఎంత పట్టు ఉందో చెప్పాల్సిన పని లేదు...హైదరాబాద్ ప్రాంతంలో టీడీపీ మంచి విజయాలే సాధించింది...అయితే తెలంగాణలో టీడీపీ కనుమరుగు అవ్వడంతో ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో టీఆర్ఎస్, ఎం‌ఐ‌ఎం పార్టీల హవా నడుస్తోంది. ఇక్కడ టీఆర్ఎస్ హవా నడవటానికి కారణం టీడీపీనే అని చెప్పొచ్చు..ఎందుకంటే టీడీపీ నాయకత్వం, క్యాడర్ పూర్తిగా టీఆర్ఎస్ వైపుకు వెళ్ళడంతోనే టీఆర్ఎస్ హవా ఉంది.
అలా టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన వారిలో మాగంటి గోపినాథ్ కూడా ఒకరు..కమ్మ వర్గానికి చెందిన మాగంటి..టీడీపీ ఆవిర్భావం నుంచే పార్టీలో పనిచేస్తున్నారు. టీడీపీలో అనేక కీలక పదవులు చేపట్టారు..హుడా డైరక్టర్‌గా, తెలుగు యువత అధ్యక్షుడుగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడుగా మాగంటి పనిచేశారు..ఇక 2014 ఎన్నికల్లో కీలకమైన జూబ్లీహిల్స్ సీటు దక్కించుకుని టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఎం‌ఐ‌ఎం పార్టీపై 9 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు...అయితే అలా టీడీపీ నుంచి గెలిచిన మాగంటి..అనూహ్యంగా టీడీపీ వదిలి టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు..ఇక 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు...అప్పుడు ఎం‌ఐ‌ఎం కూడా పరోక్షంగా టీఆర్ఎస్‌కు సపోర్ట్ ఇవ్వడంతో మాగంటి...కాంగ్రెస్ పార్టీపై 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇలా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి...దూకుడుగా రాజకీయం చేస్తున్నారు..ఇక జూబ్లీహిల్స్ అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు..ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందే..సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఉండే ఈ ప్రాంతం అన్నిరంగాల్లో ముందుంది.
ఇక ఇక్కడ రాజకీయంగా టీఆర్ఎస్, ఎం‌ఐ‌ఎం, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి...టీడీపీ క్యాడర్ అంతా టీఆర్ఎస్ వైపుకు రావడంతో మాగంటికి బాగా ప్లస్ అవుతుంది..ఎం‌ఐ‌ఎం కూడా సపోర్ట్ చేయడం కలిసొచ్చే అంశం..ఇక్కడ కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా బలమైన నేతగా ఉన్నారు..గత రెండు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు..ఈ సారి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు..కాకపోతే అన్నిరకాలుగా బలంగా ఉన్న మాగంటిని ఓడించడం అంత ఈజీ కాదు...మళ్ళీ జూబ్లీహిల్స్‌లో మాగంటి గెలిచి హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: