హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మల్లారెడ్డి మెజారిటీపైనే లెక్క?

తక్కువ సమయంలోనే రాజకీయాల్లో బాగా క్రేజ్ తెచ్చుకున్న వారిలో మల్లారెడ్డి కూడా ఒకరు. 2014 ముందు వరకు ఈయన పేరు రాజకీయాల్లో పెద్దగా వినిపించలేదు...కాకపోతే ఈయన ఇంజినీరింగ్ కాలేజీలు మాత్రం బాగా హైలైట్ అయ్యాయి..విద్యావేత్త అయిన మల్లారెడ్డి 2014 ముందు టీడీపీలోకి వచ్చి..2014 ఎన్నికల్లో దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలా తొలిసారి ఎంపీగా గెలిచారు.
అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి దిగజారిపోవడంతో...మల్లారెడ్డి టీడీపీని వదిలి, టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు. అలా టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన మల్లారెడ్డి..2018 ముందస్తు ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీపై దాదాపు 87 వేల ఓట్ల భారీ మెజారిటీతో మల్లారెడ్డి గెలిచారు. ఇక ఆర్ధికంగా బలమైన నేత కావడంతో మల్లారెడ్డికి మంత్రి పదవి కూడా దక్కింది.
ఇక ఈయన మంత్రిగా ప్రజలకు పనులు చేసి హైలైట్ అవ్వడం కంటే...ఎక్కువ వివాదాల్లో చిక్కుకుంటూ హైలైట్ అయ్యారు...అలాగే ఈయనని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. ఈయన అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, భూ కబ్జాలు చేస్తున్నారని రేవంత్ పలు సందర్భాల్లో ఆరోపించారు..ఇక దమ్ముంటే తనపై ఆరోపణలు నిరూపించాలని మల్లారెడ్డి కూడా ఎదురు దాడి చేస్తూ ఉండేవారు..అలాగే ఈయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం..అసెంబ్లీలో కేసీఆర్‌కు భజన చేయడం లాంటి అంశాలతో బాగా హైలైట్ అయ్యారు. ఇక ఎమ్మెల్యేగా మల్లారెడ్డి...మేడ్చల్‌లో అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు...నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడంలో కూడా ముందున్నారు.
ఇలా వివాదాల్లో ఎక్కువ ఉంటున్న మల్లారెడ్డి...వచ్చే ఎన్నికల్లో కూడా మేడ్చల్ నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి...పైగా అక్కడ మల్లారెడ్డి స్ట్రాంగ్‌గా ఉన్నారు. అలాగే ఆర్ధికంగా కూడా మల్లారెడ్డిని ఢీకొట్టడం కష్టమే. అయితే ఇక్కడ కాంగ్రెస్ తరుపున పోటీచేసి ఓడిపోయిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి...కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. అటు మేడ్చల్‌లో బీజేపీకి పెద్దగా బలం కనిపించడం లేదు. ఈ పరిస్తితులని బట్టి చూస్తే ఈ సారి కూడా మల్లారెడ్డి మెజారిటీ ఎంత అనేది చర్చించుకోవాల్సి వస్తుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: