హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అరికెపూడికి హ్యాట్రిక్ ఫిక్స్?

తెలంగాణలో అధికారంలో టీఆర్ఎస్‌లో టీడీపీ నాయకులే ఎక్కువని చెప్పొచ్చు..ఆ పార్టీలో సగానికి సగం టీడీపీ నుంచి వచ్చిన నాయకులే ఉన్నారు..అలాగే తెలంగాణలో టీడీపీ కార్యకర్తలు సైతం టీఆర్ఎస్ వైపుకే వెళ్ళిపోయారు. అలా టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన నాయకుల్లో అరికెపూడి గాంధీ కూడా ఒకరు. కమ్మ సామాజికవర్గానికి చెందిన గాంధీ మొదట నుంచి టీడీపీలోనే పనిచేస్తూ వచ్చారు. 2009లో శేరిలింగంపల్లి సీటు ఆశించారు...కానీ దక్కలేదు.
అయితే 2014 ఎన్నికల్లో ఆయనకు శేరిలింగంపల్లి సీటు దక్కింది...ఇక ఇక్కడ కమ్మ వర్గం, ఏపీ నుంచి వచ్చి సెటిల్ అయిన వారు ఎక్కువ ఉంటారు. అందుకే 2014లో దాదాపు 76 వేల ఓట్ల మెజారిటీతో గాంధీ టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నుంచి తెలంగాణ టీడీపీ బలం తగ్గిపోతూ వచ్చిన విషయం తెలిసిందే...పైగా చంద్రబాబు కూడా ఏపీకే పరిమితం కావడంతో తెలంగాణలో పార్టీ పరిస్తితి మరీ దిగజారిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్తితుల్లో గాంధీ టీడీపీని వదిలి, టీఆర్ఎస్‌లోకి వెళ్లారు.
2018 ముందస్తు ఎన్నికల్లో గాంధీ...శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి టీడీపీపై 43 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పుడు కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా శేరిలింగంపల్లి సీటు టీడీపీ దక్కించుకుంది. అయితే కేసీఆర్ వేవ్‌లో గాంధీ గెలిచేశారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గాంధీ...తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు...ఎలాగో నియోజకవర్గం అభివృద్ధి చెందిందే...ఐటీ, ఫార్మా పరంగా శేరిలింగంపల్లి ముందుంది. పైగా కేటీఆర్ సారథ్యంలో హైదరాబాద్‌లో ఐటీ రంగం దూసుకెళుతుంది.


రాజకీయంగా చూస్తే ఇక్కడ గాంధీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు...పైగా ఇక్కడ టీడీపీ బలం పూర్తిగా తగ్గిపోవడం గాంధీకి ప్లస్. అలాగే ఇక్కడ కాంగ్రెస్‌కు కాస్త బలం ఉంది..అటు బీజేపీ సైతం ఇక్కడ బలపడుతుంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య టీఆర్ఎస్‌కు లాభం జరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ అరికెపూడి గాంధీకి మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: