హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మంచిరెడ్డికి మళ్ళీ ఛాన్స్ లేదా?

తెలంగాణలో ఇప్పుడు చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే...టీఆర్ఎస్‌లో సగం మంది ఎమ్మెల్యేల వరకు ప్రజా వ్యతిరేకతని తెచ్చుకున్నారని, వారు మళ్ళీ గెలవడం కష్టమని పలు సర్వేలు చెబుతున్నాయి. అలా ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల లిస్ట్‌లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా ఉన్నారని తెలుస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో మంచిరెడ్డి సీనియర్ నేత...టీడీపీ ద్వారా ఈయన రాజకీయాల్లోకి వచ్చారు....2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఇబ్రహీంపట్నం బరిలో గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి విజయం సాధించారు. అయితే టీడీపీ రాజకీయంగా తెలంగాణలో కనుమరుగయ్యే స్థితికి చేరుకోవడంతో...మంచిరెడ్డి టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్‌పై పోటీ చేశారు...అయితే ఈయన ఓడిపోతారని అంతా అనుకున్నారు.
కానీ అనూహ్యంగా 376 ఓట్ల స్వల్ప మెజారిటీతో మంచిరెడ్డి గెలిచి బయటపడ్డారు. అయితే కాంగ్రెస్-టీడీపీ పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం సీటు టీడీపీకి దక్కింది..దీంతో కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అక్కడ టీడీపీ ఓట్లు చీల్చడం వల్ల మంచిరెడ్డికి ప్లస్ అయింది. అలా మంచిరెడ్డి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మంచిరెడ్డి తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు..హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటంతో ఇబ్రహీంపట్నం బాగానే అభివృద్ధి చెందింది.
అయితే ఎమ్మెల్యేగా మంచిరెడ్డి గొప్ప పనితీరు ఏమి కనబర్చడం లేదు..పైగా ఈయన తనయుడుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి..ఇవి ఎమ్మెల్యేకు మైనస్ అయ్యేలా ఉన్నాయి..అటు కాంగ్రెస్ నేత రంగారెడ్డి దూకుడుగా పనిచేస్తున్నారు...ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు...ఈ సారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్నారు...అటు బీజేపీ నుంచి రాణిరుద్రమ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ నేత రంగారెడ్డికే అడ్వాంటేజ్ కనిపిస్తోంది. ఆయనపై సానుభూతి ఎక్కువ ఉంది. మరి ఈ సారి ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డికి మళ్ళీ గెలిచే అవకాశం దక్కపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: