హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కారు ఎమ్మెల్యేకు గీతారెడ్డి చెక్?

తెలంగాణ రాజకీయాల్లో గీతారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదనే చెప్పొచ్చు..దశాబ్దాల కాలం నుంచి గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు చేస్తున్నారు..1985లో రాజీవ్ గాంధీ పిలుపుతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన గీతారెడ్డి...1989లో తొలిసారి గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అలాగే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక తర్వాత 1994, 1999 ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు..ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు చేపట్టారు.
2004 ఎన్నికలోచ్చేసరికి మరొకసారి గజ్వేల్ బరిలో నిలబడి ఎమ్మెల్యేగా గెలిచారు.  అలాగే ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఇక 2009 ఎన్నికలోచ్చేసరికి గీతారెడ్డి...జహీరాబాద్ నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు...అలాగే మరొకసారి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికల్లో సైతం జహీరాబాద్ నుంచి పోటీ చేసి, స్వల్ప మెజారిటీతో టీఆర్ఎస్ నేత మాణిక్ రావుపై విజయం సాధించారు.
అయితే కాంగ్రెస్ నేతలంతా టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోతున్నా సరే గీతారెడ్డి పార్టీని వీడకుండా పనిచేస్తున్నారు...ఈ క్రమంలోనే 2018 ఎన్నికల్లో జహీరాబాద్ బరిలో నిలబడి మాణిక్ రావు చేతిలో ఓడిపోయారు. ఇక గీతారెడ్డిపై గెలిచిన మాణిక్ రావు తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు...జహీరాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే జహీరాబాద్‌లో తాగునీటి సమస్యలకు చెక్ పెట్టడానికి వాగులు, కాల్వలపై చెక్ డ్యామ్‌లు నిర్మిస్తున్నారు.
అయితే గ్రామ స్థాయిలో రోడ్ల వసతి పూర్తిగా లేదు...ఇటు జహీరాబాద్ బస్టాండ్‌ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది...నియోజకవర్గంలో చెరకు రైతుల సమస్యలు ఎక్కువే. రాజకీయంగా చూస్తే...జహీరాబాద్‌లో టీఆర్ఎస్ బలం బాగానే ఉంది...అదే సమయంలో గీతారెడ్డి కూడా పుంజుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి ఆమెపై ఉంది. ఇక ఇక్కడ బీజేపీ కూడా నిదానంగా బలం పెంచుకుంటుంది. ఎన్నికల నాటికి బీజేపీ బలం పెరిగితే జహీరాబాద్‌లో ట్రైయాంగిల్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది. మరి చూడాలి టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గీతారెడ్డి చెక్ పెట్టగలరో లేదో.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: