హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రమేష్‌కు హ్యాట్రిక్ ఫిక్స్?

తెలంగాణలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంత బలం ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తెలంగాణలో టీడీపీకి 2009 వరకు మంచి ఆదరణ ఉంది. కానీ రాష్ట్ర విభజన తర్వాతే తెలంగాణలో టీడీపీ కనుమరుగైపోయింది గాని...అంతకముందు టీడీపీకి తిరుగులేదు. అలా టీడీపీకి తిరుగులేని నియోజకవర్గాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట ఒకటి. ఇక్కడ టీడీపీ జెండా పలుమార్లు ఎగిరింది. అలాగే టీడీపీ సపోర్ట్‌తో బీజేపీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి.


1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా ఇక్కడ టీడీపీ గెలిచింది..టీడీపీ తరుపున ఎర్రబెల్లి దయాకర్ రావు హ్యాట్రిక్ కొట్టారు..ఆ తర్వాత ఆయన పాలకుర్తికి మారిపోవడం, నెక్స్ట్ టీఆర్ఎస్‌లోకి వెళ్ళడం అందరికీ తెలిసిందే. ఇక 2009లో వర్ధన్నపేటలో కాంగ్రెస్ గెలవగా, తెలంగాణ వచ్చాక జరిగిన 2014, 2018 ఎన్నికల్లో వరుసగా టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ తరుపున ఆరూరి రమేష్ గెలిచారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్...నియోజకవర్గంలో మంచిగానే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.... వర్ధన్నపేటలో సి‌సి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి 20 కోట్ల పైనే ఖర్చు పెట్టారు. అటు వాటర్ ట్యాంకులు, ఇంటింటికి కుళాయిలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే వర్ధన్నపేట మున్సిపాలిటీలో పలు సమస్యలు ఉన్నాయి...సి‌సి రోడ్లలో నాణ్యత లేకపోవడం వల్ల రోడ్లు త్వరగా పాడైపోతున్నాయి...అటు కొన్నిచోట్ల డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల మురుగు నీరు రోడ్లపైకి వస్తుంది.  మిషన్ భగీరథ  పనులు పూర్తి కాకపోవడం వల్ల తాగునీటి సమస్యలు ఉన్నాయి.
రాజకీయంగా చూస్తే వర్ధన్నపేటలో రమేష్‌కు ఎదురే లేదు అన్నట్లు ఉంది...పైగా తాజాగా ఆయనకు వరంగల్ టీఆర్ఎస్ అధ్యక్ష పదవి కూడా వచ్చింది. ఇక ఇక్కడ కాంగ్రెస్ తరుపున బలమైన నాయకుడు లేడు.. గతంలో పనిచేసిన కొండేటి శ్రీధర్ బీజేపీలోకి వెళ్ళిపోయారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్‌కు అంత బలం కనిపించడం లేదు. అలా అని బీజేపీకి కూడా ఎక్కువ బలం లేదు. మొత్తానికి చూసుకుంటే వర్ధన్నపేటలో రమేష్ హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: