హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: లారీ డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యేగా రాణిస్తున్నారా?

నన్నపునేని నరేందర్...వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఈయన గురించి పెద్దగా పరిచయం అక్కరలేదనే చెప్పాలి. కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన నేత. ఒక సామాన్యుడు సైతం రాజకీయాల్లో రాణించగలరని నిరూపించిన నాయకుడు. నరేందర్ తండ్రి నరసింహమూర్తి..ఈయనొక లారీ డ్రైవర్. అయితే లారీ డ్రైవర్ కొడుకు, పైగా చదువుకున్నది కూడా తక్కువే. దీంతో సరైన ఉద్యోగం కూడా దొరకదు. మరి ఎలా వచ్చారో తెలియదు గాని, టీడీపీపై అభిమానంతో...1995లో పార్టీలోకి వచ్చారు.
1997లో డివిజన్ అధ్యక్షుడు స్థాయి నుంచి...2008లో వరంగల్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు స్థాయి వరకు ఎదిగారు. ఇక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 2009లో టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో చిన్నాచితక పదవులు చేస్తూ...2014లో గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడుగా ఎదిగారు. ఇక 2016లో టీఆర్ఎస్ నుంచి గ్రేటర్ వరంగల్‌ కార్పొరేషన్ ఎన్నికలో కార్పొరేటర్‌గా గెలిచి..కార్పొరేషన్‌కు తొలి మేయర్ అయ్యారు.
2018 ఎన్నికలోచ్చేసరికి నరేందర్‌కు అదృష్టం కలిసొచ్చింది. అప్పటివరకు వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ టీఆర్ఎస్‌ని వదిలి కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో ఈస్ట్ సీటు నరేందర్‌కు దక్కింది..అలాగే ఆయనకు విజయం కూడా వచ్చింది. దాదాపు 28 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌పై గెలిచారు. ఇక తొలిసారి ఎమ్మెల్యే అయిన నరేందర్ తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు...నియోజకవర్గంలో ప్రజా సమస్యలని పరిష్కరించడంలో ముందున్నారు.
అలాగే కేటీఆర్ సహకారంతో ఈస్ట్‌లో మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు..ఐటీ హబ్‌ని ఏర్పాటు చేశారు. అలాగే మెడికల్ హబ్‌గా ఈస్ట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు.  రోడ్లు, తాగునీటి వసతులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, రైతు బజార్లు, మెరుగైన అండర్ డ్రైనేజ్ వసతులు కల్పిస్తున్నారు.
రాజకీయంగా ఈస్ట్‌లో నరేందర్‌కు మంచి ఫాలోయింగ్ పెరిగింది...ప్రస్తుతానికి ఈస్ట్‌లో నరేందర్‌కు మంచి బలం ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఈస్ట్ నుంచి కొండా సురేఖ ఫ్యామిలీ పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. కొండా ఫ్యామిలీ పోటీ చేస్తే నరేందర్‌కు కాస్త ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. ఈస్ట్‌లో బీజేపీ బలం శూన్యం. పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ఉండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: