హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జీవన్ రెడ్డికి అరవింద్ చెక్ పెట్టగలరా?

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లో ఉన్న ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేల్లో జీవన్ రెడ్డి కూడా ఒకరు. ఈయన కేసీఆర్‌కు భక్తుడు మాదిరిగా ముందుకుపోతారు. అసలు ప్రత్యర్ధులపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ ఉంటారు. మీడియాలో ఏ విధంగా తన వాయిస్‌ని వినిపిస్తారో చెప్పాల్సిన పని లేదు. ఇలా ఫైర్ బ్రాండ్‌ నేతగా ఉన్న జీవన్ రెడ్డికి చెక్ పెట్టాలని కమలం పార్టీ గట్టిగానే ట్రై చేస్తుంది. ముఖ్యంగా ఈయన కమలంతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు.
దీంతో కమలం నేతలు సైతం జీవన్ రెడ్డిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, జీవన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఎందుకంటే జీవన్ రెడ్డి నియోజకవర్గం ఆర్మూర్, అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఉంది. అయితే జీవన్ రెడ్డికి చెక్ పెట్టడం అంత ఈజీ కాదు. మామూలుగానీ జీవన్ రెడ్డి బలమైన నాయకుడు. ఈయన వరుసగా ఆర్మూర్ నుంచి గెలుస్తూ వస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా సత్తా చాటారు.
అలాగే టీఆర్ఎస్ పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి నిధులు తెచ్చుకుని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అటు ప్రజలతో టచ్‌లోనే ఉంటున్నారు. కాకపోతే జీవన్ రెడ్డి చుట్టూ వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈయన వివాదాలతోనే సావాసం చేస్తారు. కాకపోతే రాజకీయంగా ఈయనకు బలంగా ఎక్కువగా ఉంది. గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసి...ఆర్మూర్‌లో జీవన్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఆకుల లలిత టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు.
దీంతో ఆర్మూర్‌లో జీవన్ రెడ్డికి తిరుగు లేకుండా పోయింది. ఇక ఇక్కడ కాంగ్రెస్ బాగా వీక్ అయింది. అయితే బీజేపీకి కాస్త పట్టు ఉంది. అరవింద్ ఉండటం వల్ల ఆర్మూర్‌లో బీజేపీకి బలం కనిపిస్తోంది. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో అరవింద్ డైరక్ట్‌గా జీవన్ రెడ్డిపై పోటీ చేస్తే గట్టి పోటీ ఇవ్వొచ్చు. మరి చూడాలి జీవన్ రెడ్డికి చెక్ పడుతుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: