హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తుమ్మల ప్రత్యర్ధికి మళ్ళీ ఛాన్స్ లేదా?

తుమ్మల నాగేశ్వరరావు...తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దశాబ్దాల పాటు ఖమ్మం జిల్లా రాజకీయాలని శాసిస్తున్న నేత. గతంలో టీడీపీ, ఇప్పుడు టీఆర్ఎస్‌లో కీలక నాయకుడుగా పనిచేస్తున్నారు. తుమ్మల టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. 1985లో సత్తుపల్లి నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో గెలిచారు. అలాగే చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు.
ఇక 2004లో ఓడిపోయిన తుమ్మల...2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు.  అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల్లో కూడా తుమ్మల ఖమ్మంలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక టీడీపీ ఎక్కువ ఏపీకే  పరిమితం కావడంతో, తెలంగాణలో ఆ పార్టీ పరిస్తితి దిగజారింది. దీంతో తుమ్మల టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అలాగే ఎమ్మెల్సీ అయ్యి, కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2016లో పాలేరు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు.
అయితే 2018 ఎన్నికల్లో తుమ్మలకు ఓటమి ఎదురైంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. కానీ తర్వాత తుమ్మలకు ట్విస్ట్ ఇస్తూ..ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో చేరాక ఉపేందర్ వర్గానికి, తుమ్మల వర్గానికి పడని పరిస్తితి. రెండు వర్గాలు సెపరేట్‌గా కార్యక్రమాలు చేసుకుంటున్నాయి.
ఎమ్మెల్యేగా ఉపేందర్ నిధులు తెచ్చుకుని పాలేరులో పనులు చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే కార్యక్రమాల్లో తుమ్మల వర్గానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. పైగా తుమ్మలకు ఏ పదవి రాలేదు. దీంతో ఆయన వర్గం గుర్రుగా ఉంది. మధ్యలో తుమ్మల కొన్ని రోజులు పార్టీలో యాక్టివ్‌గా లేరు. మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. అంటే కేసీఆర్ ఏదైనా పదవి ఇస్తారని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో పాలేరు సీటుని తుమ్మల తన తనయుడుకు అడుగుతున్నారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉపేందర్ ఉన్నారు. అయితే కేసీఆర్, తుమ్మల వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చూడాలి మరి తుమ్మల ప్రత్యర్ధి పరిస్తితి ఏం అవుతుందో?
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: