హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ కారు ఎమ్మెల్యేకు ఎదురుగాలి?

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొత్తం అధికార టీఆర్ఎస్ అండర్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడున్న 14 సీట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే వీరిలో చాలామంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. ఏదో గత ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ చూసి జనం...టీఆర్ఎస్‌ని గెలిపించేశారు. కానీ ఇప్పుడు కేసీఆర్ బొమ్మని చూడటం కష్టం...పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సొంతంగా మంచి ఇమేజ్ పెరగలేదు. దీంతో ఇక్కడ ఎక్కువ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు.
అలా ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్న వారిలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కూడా ముందు వరుసలో ఉన్నారని తెలుస్తోంది. గతంలో టీడీపీలో పనిచేసిన అబ్రహం టీఆర్ఎస్‌లోకి వచ్చి 2018 ఎన్నికల్లో సత్తా చాటారు. కాంగ్రెస్ నేత సంపత్‌కుమార్‌ని ఓడించారు. కేవలం కేసీఆర్ గాలిలో అబ్రహం గెలిచేశారు. కానీ ఎమ్మెల్యేగా ఆయన అలంపూర్‌లో పెద్దగా చేసిన అభివృద్ధి లేదు. మామూలుగా ప్రభుత్వం జరిగే కార్యక్రమాలు తప్ప.
పైగా ఇక్కడ టీఆర్ఎస్‌లో గ్రూపు గొడవలు ఎక్కువ ఉన్నాయి. అలాగే రియల్ మాఫియా రాజ్యమేలుతుందని టాక్. ఇవన్నీ ఎమ్మెల్యేకు మైనస్ అవుతున్నాయి. ఇక నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి అంతంత మాత్రమే. రాయలసీమకు దగ్గరగా ఉండే ఈ నియోజకవర్గంలో రోడ్ల పరిస్తితి అధ్వాన్నంగానే ఉంది. వేసవి వచ్చిందంటే తాగునీటి కష్టాలు మొదలవుతాయి. ఇంకా అలంపూర్ లో చాలా ఫేమస్ అయిన జోగులాంబ దేవాలయాన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాల్సి ఉంది.
రాజకీయంగా చూస్తే ఎమ్మెల్యే అబ్రహంపై వ్యతిరేకత మాత్రం పెరుగుందని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో ఏదో కేసీఆర్ గాలి ఉంది...కానీ ఈ సారి కేసీఆర్ కూడా అబ్రహంని సేవ్ చేయడం కష్టం. అటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌పై సానుభూతి ఎక్కువ ఉంది. ఈయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. మొత్తానికి చూసుకుంటే అలంపూర్ లో ఎమ్మెల్యే అబ్రహంకు కాస్త ఎదురుగాలి వీస్తున్నట్లే కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: