హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: నాగిరెడ్డికి ఈ సారి కష్టమే?

ఏదేమైనా రెండున్నర ఏళ్లలో ఏపీలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవమే అని చెప్పాలి. వైసీపీలో దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని చెప్పొచ్చు. ఏదో జగన్ ఇమేజ్, పథకాలు, అధికార బలం ఉండటం వల్ల...కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత హైలైట్ అవ్వడం లేదు గానీ...క్షేత్ర స్థాయిలో చూస్తే చాలామంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది.
ఇక గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌పై గెలిచి సంచలనం సృష్టించిన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పనితీరు పట్ల కూడా ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారని సమాచారం. రెండున్నర ఏళ్లలో ఎమ్మెల్యే పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని తెలుస్తోంది. పైగా ఆయన ప్రజలకు అండగా ఉండటంలో కూడా వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. ఏదో సంక్షేమ పథకాలు...నాడు-నేడు, జగనన్న కాలనీల లాంటి కార్యక్రమాలు ప్లస్ అవుతున్నాయి తప్ప...ప్రత్యేకంగా ఎమ్మెల్యేకు ఏ ప్లస్ లేదని తెలుస్తోంది.
పైగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఎమ్మెల్యే పెద్దగా పోరాటాలు చేయడం లేదు. అందుకే ఇటీవల జరిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికలో సైతం గాజువాక పరిధిలో ఉన్న డివిజన్లలో వైసీపీ సత్తా చాటలేకపోయింది. ఇక్కడ కమ్యూనిస్టులు, టీడీపీ సత్తా చాటాయి. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ పవన్ పోటీ చేసి ఓడిపోయాక..మళ్ళీ ఈ నియోజకవర్గంపై పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ స్టీల్ ప్లాంట్ కోసం పవన్ పోరాడటం కలిసొచ్చే అంశం..అటు టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. అందుకే అక్కడ పల్లాకు బాగా అడ్వాంటేజ్ కనిపిస్తోంది.
అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన విడిగా పోటీ చేస్తే మళ్ళీ వైసీపీకే బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి...ఒకవేళ కలిసి పనిచేస్తే వైసీపీకి చెక్ పెట్టడం ఈజీ..కానీ సీటు టీడీపీకి వస్తుందా? జనసేనకు వస్తుందా? అనేది క్లారిటీ లేదు. ఏదేమైనా గాజువాక బరిలో ఈ సారి నాగిరెడ్డి గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: