వివాహేతర సంభందం నేఱం కాదు - సుప్రీం తీర్పు శిరోధార్యమా?

చట్ట ప్రకారం వివాహేతర సంబంధం నేఱం కాదు - మరి విచ్చల విడితనం కూడా నేఱం కాదా!  వివాహేతర సంబంధం అనైతికం అనుకుంటే భార్యా భర్తలు విడాకులు తీసుకోవచ్చు’ ఇది మన దేశ ‘సర్వోన్నత న్యాయ స్థానం’ ఒక రాజ్యాంగ పీఠం సెలవిచ్చిన నిర్ణయాత్మక తీర్పు ఇది.  

వివాహేతర సంభందం నేఱం కానప్పుడు, మరి విచ్చలవిడి తనం మాటేమిటి? అభాగ్యులు, అసహాయుల సంగతేమిటి ?  భారత రాజ్యాంగం ప్రసాదించిన: 

*సమానత్వ హక్కు (రైట్ ఆఫ్ ఈక్వాలిటీ ), 
*స్వేచ్ఛ హక్కు (రైట్ టూ ఫ్రీడం)

పై రెంఢింటినీ ఆధారం చేసుకొని ఈ అద్భుత అభిప్రాయాన్ని సుప్రీం కోర్ట్ వెలి బుచ్చి ఉండవచ్చు. ఇలా ప్రకటించిన న్యాయమూర్తులకు ‘రాజ్యాంగం’ ఒక్కటి మాత్రమే మనసులో మెదిలి ఉండాలి.  రాజ్యాంగంలో లేని 

*మానవ మనస్తత్త్వ శాస్త్రం, 
*బాలల మనస్తత్త్వ శాస్త్రాలను,
*భారత జాతి జనుల నరనరాల్లోను, జన్యువులలోను సహస్రాబ్ధాలుగా ఇంకి ఉన్న  నిరంతర చిరంతన, ఉదాత్త ధర్మ భావన, జిజ్ఞాస, ఆచరణీయతలను వారు తీర్పిచ్చే సమయంలో విస్మరించడం శోచనీయం, దురదృష్టకరం.

అసలు సమాజం - సమాజ శాస్త్రం - మానవత్వం మానవ సమాజం - జంతువులు జంతుతత్వం వీటిని మనసు నుండి తొలిచేసి మానవులకు జంతువులకు ఉన్న భేదం విస్మరించి దాన్ని పలుచన చేసి ఇచ్చిన తీర్పిది.  

తమ తల్లిగాని, తండ్రిగాని వివాహేతర సంబంధం నెఱపు కోవటం వాళ్ళ పిల్లలు గమనిస్తే, లేదా అర్ధం చేసుకుంటే ఆ లేత మనసులు పడే మనోవేదన, మానసికక్షోభ, తోటి పిల్లల నుండి అనుభవించే చులకనబావం, పలుచనవ్వటం, చులకన, స్వయం అపరాధ చింతన, అన్యాయ, నిర్హేతుకఫు తలవంపులు ఎంత దుర్భరంగా ఉంటాయో? సాధారణ మాటలలో చెప్పలేం, రాయలేం, వివరించలేం. తమ పిల్లలకు అలాంటి దుర్భరవేదన కలిగించే అధికారం, హక్కు తల్లి దండ్రులకు ఉన్నాయా? సమాజానికి ఉన్నాయా? సర్వోన్నత న్యాయస్థానంకైనా ఉన్నాయా? 

మానసిక దౌర్బల్యంవలననో, కామం ప్రకోపించో  ‘కోరిక’ రెచ్చగొట్టే పరిసరాలు, తీవ్ర అంతర్గత ఒత్తిడి, ఎదుటి అందుబాటులో ఉన్న వ్యతిరెఖ సెక్స్ రగిల్చే శృంగార భావాల సెగల వలననో ఎవరైనా- ‘వివాహేతర సంబంధం నేరం కాదు’ అని కోర్టు చెప్పింది కాబట్టి - తమ తమ పిల్లలకు తెలియకుండా ఇలాంటి కార్యకలాపాలు కొన సాగించ గలుగుతారే అనుకుందాం. 

కొన్నాళ్లకు పిల్లలకు ఆ సంగతి తెలియకుండా ఉంటుందా? అప్పుడు ఎదిగిన మనసులతో కౌమారులు, లేత మనస్కులు - మానసిక క్షోభ అనుభవించరా?  లేకపోతే వాళ్ళూ పెళ్ళిళ్ళు జరిగాక- తమ తల్లి దండ్రుల మార్గాలలోనే నడవరని చెప్పగలమా? ఇలా సత్ప్రవర్తన పట్ల సమాదరణ లోపిస్తే సమాజం గతి  దశదిశ ఏమవుతుంది? సామాజిక సృహలేని సమాజం పశుసంస్కృతి సంతరించుకోదా?  

‘స్వీయ సుఖానుభూతి' అతి ముఖ్యమని వాదించే ప్రఖ్యాత రచయిత గుడిపాటి వెంకటాచలం చెప్పిన సందేశానికి హారతి పట్టే ఈ సుప్రీం ప్రవచనం ఎంత వరకు శిరోధార్యం? ఏ విధంగా ఆచరణ యుక్తం?

పిల్లలకు తెలియకుండా ‘మా సుఖానుభూతి పనులను మేము చూసుకుంటాం కదా!’ అని అంటారేమో ఈ సుప్రీం కోర్టు తీర్పుకు అనుకూలురు. ఎవరూ చూడకుండా 'తగని లేదా కూడని పని' చేస్తే అది నేరమో! తప్పో కాకుండా పోతుందా? అలాంటప్పుడు దొంగతనం కూడా తప్పుకాదు.

ఎలాగంటే తన దగ్గర లేనిది, తనకు కావలసినది అందుబాటులో ఉన్నచోట నుండి ఎవరికి తెలియకుండా తెచ్చుకోవటం దొంగపని. తనకు ఇంట్లో దొరకనిది. తనకు సరిపోనిది అందుబాటులో ఉన్న మరో వ్యక్తి దగ్గర పొందటం వివాహేతర సంబంధాలు పెట్టుకునేవారు చేసే పని. ఇలా తర్కిస్తూపోతే లోకంలో ఏదీ తప్పుకాదు, ఏదీ నేరమూ కాదు.

సుప్రీం న్యాయమూర్తులకు ఒక సార్వకాలిక, సార్వజనీన సత్యం తెలుసు. అది ఏమిటంటే చట్టబద్ధమైన ప్రతిదీ న్యాయ సమ్మతమే. కానీ న్యాయ సమ్మతమైన ప్రతిదీ చట్ట బద్ధం కాదు. 

ఉదాహరణకు ఒకవ్యక్తి మరోవ్యక్తి దగ్గర తన ప్రాణావసరం తీర్చుకోవటానికి కొంతధనం ప్రామిసరీ నోట్ రాసిచ్చి తెచ్చుకున్నాడని అనుకుందాం. అలాంటప్పుడు ఆ అప్పు ఋణ ధాతకు మూడేళ్ళ లోపు తీర్చెయ్యాలి. లేకుంటే ఈ లోగా ఋణ ధాత ఋణ గ్రహీతపై చట్టప్రకారం న్యాయస్థానంలోగాని ఇతర చట్టసంస్థల ద్వారా చర్యతీసుకోక పోతే అంటే లిమిటేషన్ పీరియడ్ దాటితే ఋణం తీర్చనవసరం లేదు. ప్రాణావసరం కోసం తీసున్న ఋణం తీర్చకపోవటం ధర్మంకాదని ధర్మశాస్త్రం చెపుతుంది. లిమిటేషన్ దాటితే ఋణం చెల్లించనవసరం లేదని న్యాయశాస్త్రం చెపుతుంది  
   
మరో ఉదాహరణ ఒకతను ఇంకెవరినో చంపు అని చెప్పి అందుకు ప్రతిఫలంగా ఒక హంతకమే వృత్తిగా జీవించే వృత్తి దారుడికి పదివేల రూపాయలు ముందుగానే ఇచ్చాడనుకుందాం. కానీ, ఆ వృత్తి హంతకుడు ఆ హత్య చేయలేదు. ముందుగానే పైకం తీసుకొని కూడా, ఇచ్చిన మాట నిలుపుకోలేదు. కనుక వృత్తిదారుడు చేసిన నమ్మక ద్రోహం న్యాయ బద్ధం కాదు, హత్య చేయక పోవటం చట్టబద్ధమే. ఇదిగో ఇలాగే ఉంటాయి సమాజ శ్రేయస్సు దృష్ట్యా చాలా విషయాలు, భారతీయ జీవనంలో దాంపత్య జీవన సాంప్రదాయం

వివాహేతర సంబంధం మానవుని ప్రాకృతిక వాంచ సహజ ధర్మమూ,  ప్రాథమిక హక్కులలోనిదీ కావచ్చు. కానీ సమాజ భద్రత, సుస్థిరత, శాంతి, క్రమశిక్షణ, పురోగతుల దృష్ట్యా దానిని నేరం గానే చూడాలి. 

ఈ సందర్భంగా ప్రఖ్యాత అమెరికా ఆధ్యాత్మిక విజ్ఞాన విదుషీమణి అయిన మేరీ బేకర్ ఎడ్డీ (1821-1910)......“పరిశుద్ధత లేక పాతివ్రత్యము నాగరికత పురోగతుల నిర్మాణానికి పునాది - అదే గనుక లేకపోతే సామాజిక సుస్థిరత, నియమబద్ధ జీవనం ఉండవు” 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: