మదర్స్ డే ఎలా మొదలైంది?

Vamsi

కొన్నిదేశాల్లో ఒక్కోరోజును ఒక్కో ఉత్సవంగా జరుపుకోవాలన్న ఆలోచనతో మొదలైందే మాతృదినోత్సవం. అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతున్న కాలం..! కుటుంబ సంబంధాలకు కాలం చెల్లుతున్న క్షణాలు..! ఎలాగైనా వాటిని కాపాడుకోవాలని అన్నా జర్విస్ లాంటివారు ముందుకు వచ్చారు. అదే ఏడాది ‘మదర్స్ ఫ్రెండ్‌షిప్ డే’ పేరిట ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అలా మొదలైన ఉత్సవాలు న్యూయార్క్‌లోని జూలియా వార్డ్ హోవ్‌ను కదిలించాయి.


మదర్స్ ఫ్రెండ్‌షిప్ డేను.. ఆమె 172 జూన్ 2 నుంచి ‘మదర్స్ డే’గా జరపడం మొదలుపెట్టారు. ఏటా ఈ ఉత్సవం కోసం ఓ సెలవు రోజు ఉంటే బాగుంటుందన్న ఆలోచన 1904లో వ్యక్తమైంది. ఆ ఆలోచనలో భాగంగానే ప్రతి ఏడాది మే రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని జరుపుకోవాలని అమెరికాతో పాటు 50కిపైగా దేశాలు నిర్ణయించుకున్నాయి. అలా ఏటా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.


 ఆధునిక యాంత్రక యుగంలో ప్రీ బర్త్ స్కూల్స్ వచ్చినా.. ప్రీ స్కూల్ గార్డెన్స్ వచ్చినా.. అమ్మ ప్రేమ పదిలమే.. ఇంటర్నెట్ యుగంలో కూడా అమ్మతనంలో కమ్మదనాన్ని మరిచిపోలేదు. . ఎందుకంటే బ్లాగులు, సోషల్ నెట్ వర్క్ సైట్లు, ఆన్ లైన్ కవిత్వ, సాహిత్య వెబ్ సైట్లలో అమ్మ  కవిత్వానికే అగ్ర తాంబూలం. చాలా మంది తమ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ప్రొఫైల్ ఫోటోగా తల్లీ బిడ్డల ఫోటోలనే ఎంచుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: