నారి నారి నడుమ మురారి - హరికి హరికి నడుమ వయారి

సిరి గల వానికి చెల్లెను,  తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్తిరిపెమునకిద్దరాండ్రా,  పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.   ఒకరోజుశ్రీనాధ కవిసార్వభౌముదు రాజదర్శనము కోసం కారడవుల గుండా ప్రయాణిస్తున్న సమయములో కొంతసేపటికి ఒక నదీ తీరము వద్దకు తనదాహముతీర్చుకొవటానికి రావటము నది లో కూడా నీరు లేకపోవటాన్ని గమనించి పరమ శివుని పై ఈ చాటువు (సెటైరికల్ పోయెం) అసువుగా పాడుతాడని లోకోక్తి.


ఓ పరమశివా! సంపదలున్నవారు (లక్ష్మి దేవే భార్యగా ఉన్న శ్రీకృషుడిని మనసులో ఉంచుకొని) 16000 తరుణులను పెండ్లాడినా చెల్లుతుంది. బిక్షమెత్తుకొని బ్రతికే నీకెందుకయ్యా ఇద్దరు భార్యలు (పార్వతి మరియు గంగ) ఒక భార్య గంగను (గంగా అంటే ఇక్కడ నీరు దాహం తీర్చుకోవటానికని అర్ధము) వదిలివేసి పార్వతితో బ్రతికేయి సరిపోతుంది అంటాడు. గంగా జలాన్ని తనకివ్వమని అర్ధం.

 

16000 మంది భార్యలను పొషించాలంటే సిరి సంపదలు గలవానికే సాధ్యమని అన్యాపదేశంగా చెప్పాడు శ్రీనాధుడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒక  అవతారం శ్రీకృష్ణావతారం. నేనే దేవుడను అని శ్రీ కృష్ణ భగవానుడు మాత్రమే చెప్పాడు. శ్రీ రామునికి ఉన్నన్ని దేవాలయాలు గాని, శ్రీ కృష్ణుని కి ఉన్నంతమంది భక్తులు గాని వేరే  ఏ దేవుళ్ళకు లేరు. ఈ విశ్వానికే  శ్రీ కృష్ణుడు గురువు అంటే జగద్గురువు.


ఆయన  రసికుడు మాత్రమే కాదు యోగీశ్వరుడు కూడా!  శ్రీ కృష్ణుడు అంతటి భోగి, శ్రీ కృష్ణుడు అంతటి యోగి కూడా వేరెవరూ లేరు. ఈ ద్వాపరయుగ కథానాయకుడికి అష్ట భార్యలు, పట్టపురాణుల్గా ఉన్నారు వీరికి తోడు పదహారు వేల రాజకన్యలు ఆ మహనీయుని భార్యలు ఉన్నారంటే అందరికి ఆశ్చర్యమే. బహుభార్యాత్వము ద్వాపర యుగధర్మల్లో ఒకటి. ఈ కాలములో అంటే కలియుగములో కూడా:


*చైనా చక్రవర్తి చిన్ షి యాంగ్ 13,140 భార్యలు ఉండేవారు.

*సాల్మన్ చక్రవర్తికి 700 భార్యలు, 300 ఉంపుడుగత్తెలు ఉండేవారు.

*మొరాకో చక్రవర్తి మౌలి ఇస్మాయిల్ కు 543 భార్యలు ప్లస్ 900 సంతానంతో బహు కుషి గా ఉండేవాడట.

*అక్బర్ చక్రవర్తికి 5000 ప్రేయసీ మణులు ఉండేవారని ప్రతీతి. అంతెందుకు

*హైదరబాద్ నవాబు గారికి  కూడా 300 పైగా భార్యలే కాక ఎందరో ఉంపుడుగత్తెలు ఉండేవారని ప్రచారంలో ఉంది.


భారత్ లోని లడక్ లో బహుభతృత్వం సర్వ సాధారణం ఇప్పటికి కూడఒకప్పటి న్యాయ శాస్త్రాల ప్రకారం ఎవరికీ ఇబ్బందికలగకుండా పోషించగల శక్తి, అనుభవించగల పటుత్వము,  సామర్ధ్యం ఉన్నవారెవరైనా ఎంతమందినైనా పెండ్లి చెసుకొని బహుభార్యాత్వాన్ని కలిగి ఉండవచ్చు. ఇక్కడ వ్యభిచారం, పరస్త్రీ వ్యామోహం మాత్రం నేరం. వ్యభిచార నియంత్రణ - పరస్త్రీ రక్షణ న్యాయవ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యం.


నరకాసురుడు అనే రాక్షస రాజు ప్రజాకంటకుడై,  స్త్రీల మాన ధన ప్రాణాలను హరిస్తూ యువతీ అపహరణలు చేస్తూ క్షుద్రోపాసకుడై ఈ భరతఖండమును (జంబూ ద్వీపం) పీడిస్తుండేవాడు. భరతఖండం అంటే ఇప్పటి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీ -లంక, టిబెట్, బర్మా కలిపిన భూభాగమే.”  నరక పీడితుల కోరికపై శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై నరకునితో సమరం చేసి నరక సమ్హారము చేస్తాడు. నరకుని కుమారుని కే రాజ్యాభిషేకము చేసి,  నరకునిచే క్షుద్రదేవతలకు బలివ్వటానికి చెరపట్టబడ్డ 16000 రాచ కన్య లను చెరనుండి క్షేమంగా విడిపించి తమతమ రాజ్యాలకు వెళ్ళమని కోరతాడు. కాని వారు శ్రీకృష్ణుని తోనే ఉంటామని సమరములో విజయం పొందిన వారికే ఓడిన రాజుకు చెందిన సర్వస్వం అంతః పురస్త్రీలతో పాటు పరిచారికలు కూడా చెందే ఆచారమున్న రోజులవి.   వారి యుగ ధర్మ బద్ద  వాదనకు అంగీకరించి ధన, కనక, వస్తు, వాహన, సామంతాది ప్రముఖులతో అంతఃపురాన్ని స్వంతము చేసుకుంటాడు.


 వారిని ద్వారకకు తరలించి ఆ రాచకన్యకామణు లను అలౌకికంగా భార్యలుగా స్వీకరిస్తాడు. ఆ విధంగా తన 16008 మంది భార్యలతో 406 సంవత్సరాలు జీవించాడు ఈ శ్రీ కృష్ణ భగవానుడు. 16000 మంది భార్యలతో అమలిన దాంపత్యముతో 1,60, 000  మంది సంతానాన్ని పోందినా, శ్రీకృష్ణుడి ని అస్ఖలిత బ్రహ్మచారిఅనే అంటారు. మనకు సహజం గా పదహారు వేలమందితో ఎలా సంసారం చేశాడనే,  కొంటే ఆలోచన వస్తుంది.

నెమలికి  శారీరక  సంభోగముండదు. అది దాని ప్రత్యేకత.   ప్రత్యేక లక్షణం.  మగనెమలి కంటినీరు సేవించి ఆడనెమలి గ్రుడ్డు పెడుతుంది అని అంటారు.  పరమ శృంగార పురుషుణి గా కనిపించే శ్రికృష్ణుడు ఒక పరమ యోగి.  ఇదే ఆయన దాంపత్య శృంగార రహస్యం.  ఆయన నెమలి పించమును ధరించే సాంప్రదాయము దీని నుంచే వచ్చింది. నెమలి పించము అమలిన శృంగారానికి చిహ్నం.శ్రీకృష్ణుడు 16000 మంది భార్యలతోనూ 8 మంది పట్టపురాణులతోను ప్రతిక్షణం ఉండేవాడు.అందుకే ఆయన జగన్నాటక సూత్రదారి..లీలావేషదారి..."యోగీశ్వర-కృష్ణుడు" అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: