నేడే ఎంతో పవర్ ఫుల్ జేష్ఠ్య మాసం అమావాస్య..ఈ పనులు చేస్తే సకల దోషాలు, దరిద్రాలు మొత్తం పోతాయ్!
సాధారణంగా అమావాస్య తిధి న ఏదైనా శుభకార్యాలు చేయడానికి మంచిది కాదు అని భావిస్తారు . అమావాస్య రోజు ఎవరు కూడా గృహప్రవేశాలు చేయడానికి పెళ్లిళ్లు చేసుకోవడం మంచి పనులు చేయడానికి ప్రారంభించరు. కానీ ఆధ్యాత్మిక కార్యకలాపాలకు మాత్రం ఈ అమావాస్య చాలా మంచిది అంటున్నారు . పితృదేవతలకు సంబంధించిన ఆచారాలు నిర్వహించడానికి ఈరోజు ఎంత పవిత్రమైన రోజట. కాగా జేష్ఠ్య మాసంలో ఈ అమావాస్య తిధి జూన్ 24వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమైంది . ఈ తిధి జూన్ 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది . ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు పితృదేవతల ఆరాధన ఎంతో ముఖ్యమైనది అంటూ చెబుతున్నారు . అమావాస్య ప్రధానంగా పితృదేవతలకు అంకితం చేయబడిన రోజు అంటూ చెబుతున్నారు .
ఈరోజు మన పూర్వీకులు ఆత్మలు భూమి పైకి వస్తాయట. ఈరోజున పితృదేవతలకు తర్పణాలు వదిలితే చాలా మంచిదట. వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది అంటున్నారు పండితులు. చంద్రుడు కనిపించని రాత్రి కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతికూల శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అనే భావన చాలామందిలో ఉంటుంది. అందుకే అమావాస్య రోజున దుష్ట శక్తుల నుంచి రక్షణ కోసం ప్రత్యేకంగా పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు కొందరు . మరీ ముఖ్యంగా ఈ అమావాస్య రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు అంటూ హెచ్చరిస్తున్నారు పండితులు .
జుట్టు కత్తిరించుకోవడం.. గోర్లు కత్తిరించుకోవడం.. క్షవరం చేసుకోవడం.. కొత్త పనులను ప్రారంభించడం .. భూమి కొనడానికి అడ్వాన్స్ గా డబ్బులు ఇవ్వడం .. ఇల్లు కట్టుకోవడానికి పునాదులు వేసుకోవడం.. పెళ్లి ముహూర్తాలు చూసుకోవడం .. శుభకార్యానికి ముహూర్తాలు చూసుకోవడం .. అదేవిధంగా కొత్త బట్టలు కట్టుకోవడం లాంటివి చేయకూడదు అని హెచ్చరిస్తున్నారు పండితులు. అంతేకాదు ఇవాళ ఉపవాసం ఉండి ప్రత్యేకంగా దేవుడికి పూజిస్తే చాలా చాలా మంచి జరుగుతుందట . ముఖ్యంగా ఉగ్రదేవతలైన కాలికాదేవి ..దుర్గామాత .. చండి మాత.. మహిషాసురవర్ధిని అమ్మవారు ఆలయాలను దర్శించుకున్న ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయట . మనకు ఉండే కష్టాలు బాధలు మొత్తం పోతాయట. ఇంట్లో చికాకు ఉన్న కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోతాయట..!
నోట్: ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కొందరు నిపుణులు, అలాగే మరి కొన్ని శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేయబడ్డింది. వీటిని నమ్మడం, నమ్మకపోవడం అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం అని పాఠకులు గుర్తుంచుకోండి..!!