
వంటింటి ఇంగ్రిడియంట్స్ తో ఐస్ క్రీమ్ తయారీ విధానం..!
మామిడి ఐస్‌క్రీమ్, మామిడి గుజ్జు – 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ – 1 కప్పు,కండెన్స్‌డ్ మిల్క్ – 1/2 కప్పు,చక్కెర – 2 టేబుల్ స్పూన్లు. మామిడి గుజ్జును బ్లెండర్‌లో బాగా మిక్స్ చేయండి. ఫ్రెష్ క్రీమ్‌ను బీట్ చేసి, దానిలో మామిడి గుజ్జు, కండెన్స్‌డ్ మిల్క్ కలపండి. మిశ్రమాన్ని ఫ్రీజర్‌లో పెట్టి 6-8 గంటలు ఫ్రీజ్ చేయండి. క్రిమీ మామిడి ఐస్‌క్రీమ్ రెడీ. చాక్లెట్ ఐస్‌క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ – 1 కప్పు, కండెన్స్‌డ్ మిల్క్ – 1/2 కప్పు, కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు, చాక్లెట్ చిప్స్ – 2 టేబుల్ స్పూన్లు. ఫ్రెష్ క్రీమ్‌ను బీట్ చేసి, కోకో పౌడర్, కండెన్స్‌డ్ మిల్క్ కలపండి. మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి, ఫ్రీజర్‌లో పెట్టండి. 6-8 గంటల తర్వాత చాక్లెట్ ఐస్‌క్రీమ్ రెడీ. బనానా ఐస్‌క్రీమ్, బనానా (పండినవి) – 2, పాలు – 1/2 కప్పు,తేనె – 1 టేబుల్ స్పూన్.
బనానాలను ముక్కలుగా కట్ చేసి, 2 గంటలు ఫ్రీజ్ చేయండి. బ్లెండర్‌లో బనానా ముక్కలు, పాలు, తేనె వేసి బాగా మిక్స్ చేయండి. మిశ్రమాన్ని ఫ్రీజర్‌లో పెట్టి 4-6 గంటలు ఫ్రీజ్ చేయండి. టాప్‌లో నట్లు లేదా చాక్లెట్ సిరప్ వేసి సర్వ్ చేయండి. ఎక్కువగా క్రిమీగా రావాలంటే, ఫ్రీజ్ చేసే ముందు 2-3 సార్లు బీట్ చేయాలి. ఐస్‌క్రీమ్‌లో రుచిని పెంచడానికి డ్రై ఫ్రూట్స్, చాక్లెట్ చిప్స్ లేదా ఫ్రూట్ పీస్ వేసుకోవచ్చు. ప్రిజర్వేటివ్‌లూ, ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా ఇంట్లో తాయారుచేసిన ఐస్‌క్రీమ్ చాలా హెల్దీ.ఇలా సులభంగా ఇంట్లో తయారుచేసుకుని, హోమ్‌మెడ్ ఐస్‌క్రీమ్‌ను ఎంజాయ్ చేయండి!