పిడ కలలు ఎందుకు వస్తాయి... అవి నిజం అవుతాయా?

frame పిడ కలలు ఎందుకు వస్తాయి... అవి నిజం అవుతాయా?

lakhmi saranya

గాడ నిద్రలో ఉన్నప్పుడు ఏదో దెయ్యం వెంటాడుతున్నట్టు, ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు అనుభూతికి లోనవుతాం. దిగ్గున లేచి అటు ఇటు చూస్తాం. ఏమి కనిపించదు. హమ్మయ్య కలలోన ఇదంతా జరిగింది! అనుకొని మళ్లీ పడుకుంటాం. అట్లనే ఒక్కోసారి నిద్ర లేవగానే మనసంతా ఉల్లాసంతో, ఉత్సాహంతో నిండిపోతుంది. రాత్రి వచ్చినా కళ గుర్తుకు వచ్చి మనలో మనమే ఆనంద పడుతుంటాం... అలాంటి కళ మరోసారి వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఏ ఒకరికో కాదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో కలలు రావడం సహజమే. అయితే వీటి పట్ల ప్రజల్లో రకరకాల నమ్మకాలు ఉన్నాయి.

 ముఖ్యంగా పీడకలలు అపశకునమని, అవి నిజం అవుతాయని కూడా కొందరు నమ్ముతుంటారు. ఇది ఎంతవరకు నిజం ? అసలు కలలు ఎందుకు వస్తాయి? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. కలలు రావటం సహజమే అయినప్పటికీ, కొందరికి ఎక్కువగా ఆందోళనకు, భయానికి గురి చేసే పీడకలలే వస్తుంటాయి. దీనిని కొందరు రాబోయే ప్రమాద సంకేతం గా భావించి ఆందోళన చెందుతుంటారు. మరికొందరు తెల్లవారు జామున వచ్చిన కలలు నిజం అవుతాయని చెబుతుంటారు. కానీ ఇదంతా వాస్తవం కాదంటున్నారు నిపుణులు పేర్కొంటున్నారు.

కలలు నిజం అవుతాయనేది చాలా మందిలో ఉండే ఒక అపోహా మాత్రమేనని, వాటిని నిరూపించగలిగే శాస్త్రియ ఆధారాలేవీ ఇప్పటి వరకైతే లేవని చెబుతున్నారు. వాస్తవానికి మనం నిద్రపోతున్న సమయంలో బ్రెయిన్ లోని రైట్ ఫ్రంటల్ లోబ్ లో జీవితంలో లేదాజీవితంలో లేదా ఏరోజుకారోజు మనం ఎదుర్కొన్న అనుభవాలు, జ్ఞాపకాల తాలూకు న్యూరోడిజనరేషన్ ప్రాసెడ్ కొనసాగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితి వల్ల మనల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన లేదా భావోద్వేగానికి గురి చేసిన సంఘటనలు, సమస్యలు, జ్ఞాపకాలు వంటివి రీ ప్రాపెస్ పొందుతుంటాయి. అవి మెదడు భాగాన్ని ప్రేరేపిస్తూ కొన్ని సార్లు కలల రూపంలో వ్యక్తం అవుతాయని, పీడ కలలు రావటానికి కూడా ఇదే కారణమని సైంటిస్టులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: