గేమ్ ఛేంజర్ రివ్యూ... రామ్ చరణ్, శంకర్ కాంబో హిట్లు కోట్టిందా!
సినిమా గ్రిప్ తీసుకున్నారు తిరు. ఈ సినిమాకి సంగీతం అందించిన వ్యక్తి తమన్. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు. ఐఏఎస్ రామ్ నందన్ స్ట్రిక్ట్ కలెక్టర్. ప్రతిదీ రూల్ ప్రకారం చేస్తుంటాడు. తన పరిధిలో ఏ తప్పు జరిగిన ఒప్పుకోడు. అలాంటి ఏఐఎస్ వైజాగ్ వచ్చిన తర్వాత సిటీని క్లీన్ చేసే పనిలో పడతాడు. అలాంటి వాడికి ముఖ్యమంత్రి సత్యమూర్తి కొడుకు బొబ్బిలి మోపిదేవి తో అనుకొని శత్రుత్వం ఏర్పడుతుంది. తన ప్రతి పనికి అడ్డొస్తున్న ఐఏఎస్ రామ్ నందన్ అడ్డు తొలగించుకోవాలని అనుకుంటాడు మోహిదేవి. అదే సమయంలో సత్యమూర్తి చనిపోతాడు.
ఆయన చనిపోతూ తన వారసత్వం ఎవరికి ఇవ్వాలో చెప్పాడు. అది సమయంలో తన తండ్రి అప్పన్న గురించి... అమ్మ గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటాడు రామ్ నందన్. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు కూడా వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది... అసలు రామ్ జీవితంలోకి దీపిక ఎలా వచ్చింది? అనే మిగిలిన కథ. గేమ్ ఛేంజర్ సినిమా గురించి శంకర్ ముందు నుంచి ఒకటే మాట చెబుతున్నాడు. ఇది ఇప్పటివరకు చూడని కొత్త కథ కాదు... కానీ స్క్రీన్ పై చాలా కొత్తగా ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని..! తెలుగులో చాలా రోజులు తర్వాత వచ్చిన పక్కా పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్.