ఉదయాన్నే ఈ పొరపాట్లు... ఆ సమస్యలకు దారితీస్తాయ్ !
ఇది క్రమంగా తినే రుగ్మతలను పెంచడం ద్వారా ఒకేసారి అధిక మొత్తంలో ఫుడ్ తీసుకోవడం, కార్బోహైడ్రేట్లు అధికంగా తీసుకోవటం వల్ల బరువు పెరగవచ్చు. కాబట్టి ఉదయం పూట హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్లతో కూడిన బ్రేక్ ఫాస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కొందరు స్వీట్లు తినకుండా అసలు ఉండలేరు. ఉదయాన్నే ఏదో ఒక స్వీట్ తినటంతోనే ఆ రోజును ప్రారంభించే వారు చాలామంది ఉంటారు. అట్లానే స్వీట్, షుగర్ తో కూడిన పానీయాలు తాగుతుంటారు. టీ, కాఫీలలో అధికంగా షుగర్ కలిపి తాగేస్తుంటారు. క్రమంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిలో పెరగటానికి, అధిక ఒరువు పెరగడానికి దారితీస్తుంది.
కాబట్టి స్వీట్ లను తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట సహజంగానే నీరు తక్కువగా తాగుతుంటాం. కాబట్టి ఉదయం లేవగానే నీళ్లు తాగుతుంటారు. కానీ కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. బ్రేక్ ఫాస్ట్ చేసాక కూడా తక్కువ నీరు తాగుతుంటారు. దీనివల్ల బాడీ హైడ్రేషన్కు గురికావడం, డల్ నెస్ పెరగటం వంటివి జరుగుతున్నాయి. ఆ రోజంతా ఉత్సాహంగా ఉండలేరు. పైగా శరీరంలో సరిపడా నీరు లేకపోతే కేలరీలు బర్న్ కావంటున్నారు నిపుణులు. అందుకే ఉదయం నీరు తాగటం ముఖ్యం. నిద్ర మంచిదే కానీ... ఎప్పుడంటే అప్పుడు కాదంటున్నారు నిపుణులు. ఉదయం కూడా ఆలస్యం అయినా లేకపోవటం ఏదో మధ్యాహ్నం తర్వాత లేవటం వంటివి నేచురల్ బాడీ రిథమ్స్ ను రివర్స్ చేస్తాయి.