మీ జుట్టు పట్టుకుచ్చులా మారాలంటే కొబ్బరి పాలను ఇలా వాడండి..!
జుట్టు మెత్తగా, పట్టుకుచ్చులా మెరుస్తూ ఉండే మరింత ఎట్రాక్టివ్ గా ఉంటుంది. కొబ్బరి, కొబ్బరి నూనె కాకుండా కొబ్బరి పాలు కూడా జుట్టుకు అందాన్ని పెంచుతాయి. కొబ్బరి పాలతో కేవలం ఆరోగ్యమే కాకుండా జుట్టు అందాన్ని కూడా కాపాడుకోవచ్చు. కొబ్బరి పాలు కూడా జుట్టుకు రాయడం వల్ల ఎలాంటి భావాలు ఉన్నాయో ఇప్పుడు చూడండి. కొబ్బరి పాలలో అనేక పోషకాలు ఉంటాయి. చుట్టూ ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు ఇ, సిలు కావాలి. ఈ రెండు ఇందులో ఉంటాయి. కొబ్బరి పాలను నేరుగా తలకు రాసి మర్దన చేస్తే... రక్త ప్రసన్న బాగా జరిగి రాలటం తగ్గుతుంది. జుట్టు పెరిగేందుకు కూడా సహాయపడుతుంది.
జుట్టు కుదుళ్ళు కూడా బలంగా, దృఢంగా తయారవుతాయి. కొబ్బరి పాలను తలకు వాడితే ప్రత్యేకంగా కండీషనర్ అవసరం లేదు. ఇదే జుట్టుకు కండిషనర్ గా మారి మెత్తగా, పట్టుకుచ్చులా చేస్తుంది. కొబ్బరి పాలను తేనె, కలబంద గుజ్జు, కొబ్బరి నూనె, బాదం నూనె కలిపి రాసిన మంచి ప్రయోజనం ఉంటుంది. చలికాలంలో జుట్టు బిరుసుగా మారి చికాకు తెప్పిస్తుంది. ఇలాంటి వారు కొబ్బరి పాలను ఉపయోగిస్తే జుట్టు అందమే మారుతుంది. కొబ్బరి పాలను డైలీ జుట్టుకి రాయటం వల్ల జుట్టు దృఢంగా మారుతుంది. కాబట్టి డైలీ ఈ పాలుని రాయండి. కొబ్బరి పాలతో కేవలం ఆరోగ్యమే కాకుండా జుట్టు అందాన్ని కూడా కాపాడుకోవచ్చు.