వేగంగా బరువు తగ్గుతున్నామని సంబరపడకండి .. ఎందుకంటే..!

lakhmi saranya
ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ బయట ఫుడ్ తినటం వల్ల బరువు అనేది విపరీతంగా పెరిగిపోతున్నారు. ఈ మధ్య చాలా మందిని వేధిస్తున్న సమస్యలు ఊబకాయం లేదా అధిక బరువు ఒకటి. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. కాబట్టి బాధితులు ఆందోళన చెందుతుంటారు. అయితే కొన్నిసార్లు శరీరంలో అకస్మిక మార్పులు సంభవించడం, ఊహించని విధంగా అధిక బరువు తగ్గుతూ రావడం వంటివి సంభవిస్తుంటాయి. దీంతో పెద్దగా కష్టపడకపోయినా ఈజీగా బరువు తగ్గుతామని కొందరు సంతోషపడుతుంటారు. కానీ ఈ మార్పు వాస్తవానికి ప్రమాద సంకేతం కూడా కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేగంగా వెయిట్ లాస్ అవుతుంటే.. అది కొన్ని అనారోగ్యాల వల్ల కూడా కావచ్చు.
అధిక బరువు ఉన్నవారు ఎన్నడూ లేని విధంగా వేగంగా బరువు తగ్గుతున్నారంటె ... థైరాయిడ్ అధికం కావడం వల్ల కూడా కావచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే హైపో థైరాయిడిజం జీవక్రియను నియంతరిస్తుంది. అయితే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ ఆపవేగవంతం చేస్తుందని, దీనివల్ల శరీరం ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయని, ఫలితంగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. దీనికి యాంటి థైరాయిడ్ డ్రగ్స్, బీటా బ్లాకర్స్ థెరపి వంటి చికిత్సలను ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.  రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక సాయం ప్రతీరక్షక వ్యాధి.
 తరచుగా వాపునకు దారితీస్తుంది. ఫలితంగా జీవక్రియను వేగవంతం చేసి, బరువు తగ్గేలా  ప్రేరేపిస్తుంది. అయితే ఆర్థరైటిస్ ఇటువంటి నివారణ లేనప్పటికీ వాపు, నొప్పి వంటివి మేనేజ్ చేయడం ద్వారా సమస్యకు పెట్టవచ్చు. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలామంది టైప్ 1 డయాబెటిస్ వల్ల వేగంగా బరువు తగ్గుతుంటారు. కాగా పలువురు తాము దాని బారిన  పడ్డామని గుర్తించడంలో విఫలం అవుతుంటారు. శరీరంలో మధుమేహం ప్రారంభం అయిందని తెలియక స్లిమ్ అవుతున్నామని భ్రమకు లోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అసలు విషయం తెలియక స్లిమ్ అవుతున్నామని భ్రమకు లోనయ్యే ఛాన్స్ ఉంటుంది. అసలు విషయం తెలిశాక ఇబ్బంది పడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: