కొబ్బరి నీళ్లు.. చలికాలంలో తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే..!

lakhmi saranya
చాలామంది వేసవికాలంలో కొబ్బరినీళ్ళని ఎక్కువగా తాగుతూ ఉంటారు. వేడి ఎక్కువగా ఉండటం వల్ల కొబ్బరి నీళ్లు తాగటం వల్ల బాడీ చల్లబడుతుందని తాగుతుంటారు. కానీ చలికాలంలో కొబ్బరినీళ్లు తాగవచ్చా? కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నందున వెంటనే శక్తినిస్తాయి. వేసవిలో అయితే వీటిని తాగటానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే చలికాలంలో తాగవచ్చా? తాగితే శరీరంలో జరిగే మార్పులేమిటి? అనే సందేహాలు కూడా కొందరిలో వ్యక్తం అవుతుంటాయి. అయితే వింటర్లో కోకోనట్ వాటర్ తాగటం వల్ల ఆరోగ్యం విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదంటున్నారు నిపుణులు. సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా వీటిని తీసుకోవచ్చనని చెబుతున్నారు.
 పైగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి నీళ్లలో మినరల్స్, విటమిన్లు, ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. తక్షణ శక్తిని ఇస్తాయి. ఇందులోని విటమిన్ సి, విటమిన్ బి వంటిది రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇక శీతాకాలంలో వెదర్ కూల్ గా ఉన్నప్పటికీ వివిధ అనారోగ్యాల రిత్యా డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ తలెత్తడం సాధారణమే. అయితే కొబ్బరి నీళ్లు తాగటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో స్కిన్ ప్రాబ్లమ్స్ అధికంగా వస్తాయి. ముఖ్యంగా చర్మం పొడిబారుతుంది. ఇలాంటి అప్పుడు కొబ్బరి నీళ్ళు అప్పుడప్పుడు తాగుతూ ఉంటే డ్రై స్కిన్ వల్ల తలెత్తే సమస్యలు పోతాయి.
 చర్మాని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లకు మూలం కాబట్టి వింటర్లో కొబ్బరి నీళ్లు తాగటం వల్ల జలుబు, ఫీవర్ వంటివి దూరం అవుతాయి. ఫైబర్ కంటెంట్ వల్ల అజీర్తి, కడుపులో ఉబ్బరం వంటివి తగ్గుతాయి. బాడీలో సోడియం లెవెల్స్ను బ్యాలెన్స్ చేయడంలో కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం సహాయపడుతుంది. అధిక రక్తపోటును, అధిక బరువును తగ్గించే గుణాలు కూడా ఇందులో ఉంటాయి. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతలను సమతూల్యం చేయడంలో కొబ్బరినీళ్లు అద్భుత పానీయం. కాబట్టి డైలీ ఒక గ్లాసు కొబ్బరి నీళ్లను తప్పకుండా తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: