పక్కనున్నా పట్టించుకోరు..! సంబంధల్లో విచ్ఛిన్నానికి ఇది ఓ కారణమే..!
రిలేషన్ షిప్ లో ఒకరిపై ఒకరు ప్రేమ, శ్రద్ధ, గౌరవ భావాలు కలిసి ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. అలాకాకుండా ఎవరో ఒకరు భాగస్వామిని నిర్లక్ష్యం చేసినట్లు, అవమానించినట్లు, పట్టించుకోకుండా ఉంటే అది అవమానంగానో, బాధ గాని అనిపించవచ్చు. ప్రస్తుతం ఫబ్బంగ్ లో అదే జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ అవ్వటం వల్ల భాగస్వామినే లేదా పక్కనున్న ముఖ్యమైన వ్యక్తిని కూడా పట్టించుకోరు. కొన్నిసార్లు పరాధ్యంలో ఉండిపోతారు. ఫోన్ లో వీడియోలు స్క్రోల్ చేస్తూ యువతని వ్యక్తితో మాట్లాడకపోవడం, వేరే వాళ్లతో ఎక్కువసేపు మాట్లాడటం చేస్తూ పక్కనున్న వ్యక్తిని విస్మరిస్తారు.
ఫలితంగా తమను పట్టించుకోవటం లేదని ఫీలింగ్ బాగాస్వామిలో కలుగుతుంది. ఆ సమయంలో బాధపడటం లేదా గొడవకు దిగటం వంటివి జరగవచ్చు. భాగస్వామిని పట్టించుకోని ఫబ్బింగ్ పోకడల వల్ల మాస్యలు తలెత్తుతాయి. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని అవతలి వ్యక్తి నొచ్చుకుంటారు. పక్కనున్న వారిని పట్టించుకోకుండా వేరే వాళ్ళతో ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడటం చేస్తుంటే ఈ వ్యక్తి దృష్టిలో తాము అంత ముఖ్యం కాదన్నా అభిప్రాయం కలుగుతుంది. దీంతో తాము కూడా దూరం కావాలని అవతలి వ్యక్తి లేదా భాగస్వామి అనుకోవచ్చు. ఇది ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కు దారితీయవచ్చు. ముఖ్యంగా రిలేషన్ షిప్లో డీస్ కనెక్ట్ అయినట్లు ఫీల్ అవుతారు.