మీ పెదాలు సహజంగా గులాబీ రంగులో మెరవాలంటే.. రోజు ఇలా చేయండి..!
కానీ కొన్నిసార్లు పెదవులపై తెల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. పెదవులపై తెల్ల మచ్చలను సులభంగా పోగొట్టుకోవడానికి ఈ కింద హోమ్ రెమిడిని ప్రయత్నించండి. కొన్ని నీటిలో రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేసి వాటర్ బాల్ అందులో వేసి బాగా నానబెట్టాలి. అనంతరం దీనితో 10 నుంచి 15 నిమిషాల పాటు పదాలపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల తెల్ల మచ్చలు సులభంగా తొలగిపోతాయి. ముందుగా వెల్లుల్లి రెబ్బలను దంచి అందులో బాదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని రోజు మీ పెదవులు పై అప్లై చేయాలి. అప్లై చేశాక కొన్ని నిమిషాల తర్వాత గురు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇది ఎఫెక్టివ్ హోమ్ రెమిడి. ఇది పెదాలను అందంగా మార్చుతుంది.
పెదాలపై ఏర్పడే తెల్లటి మచ్చలపై కొబ్బరి నూనె రాసి మర్దన చేస్తే రెండు వారాల్లో మచ్చలు పోతాయి. రెండు చెంచాల ఆవాల నూనెను ఒక చెంచా అరశి పొడిని కలిపి మచ్చలపై రాసిన మచ్చలు తొలగిపోతాయి. యాపిల్ సైడర్ వెనిగర్ లో కాటన్ బాల్ ను ముంచి పెదవులపై మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలా. పది నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పెదవుల మరకలు ఉన్న ప్రదేశంలో ఆలివ్ ఆయిల్ రాసి గంటసేపు అలాగే ఉంచి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హోమ్ రెమిడిని రోజుకు రెండు లేదా మూడుసార్లు అప్లై చేస్తే మచ్చలు సులువుగా తొలగిపోతాయి. మీ పెదవులు కూడా అందంగా కనిపిస్తాయి.