పిల్లలు అడిగిందల్లా ఇస్తున్నారా..? పేరెంట్స్ ఇది తప్పకుండా తెలుసుకోండి..!

lakhmi saranya
పిల్లలు అడిగిందల్లా కొనివ్వడం అంత మంచిది కాదు. పిల్లలు అడిగిందల్లా కొనిస్తే మరీ గారాబం అయిపోతారు. ఈ తరం పిల్లలు చాలా స్మార్ట్ వ్యవహరిస్తుంటారు. పిల్లలు ఎప్పుడూ కూడా ఉద్దేశపూర్వకంగా ఫలానాది కావాలని అడగరు. కంటికి నచ్చినది ఏదైనా సరే పిల్లలు కోరుకుంటున్నారు. ఆ వస్తువులను కొన్ని ఇవ్వకపోతే అలుగుతుంటారు. అలిగారు కదా అని వాళ్లు అడిగిందల్లా క్షణంలో తెచ్చి ఇవ్వడం మంచి పద్ధతి కాదంటున్నారు నిపుణులు. వాటిని కొనిచ్చే ముందు ఆలోచించాలి, లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు. పిల్లలు ఎప్పుడూ కూడా తమకు బొమ్మలు, తినుబండారాలు, దుస్తులు వంటివి కావాలని మారం చేస్తుంటారు.
 స్నేహితుల బద్ద లేదా ఇతరుల వద్ద చూసిన ఆట వస్తువులు కొనివ్వాలని అడుగుతుంటారు. కాదంటే అలగడం, ఏడవటం చేస్తారు. అలా వాళ్ళు అడిగినా ప్రతిదీ పేరెంట్స్ వాళ్లకి ఇవ్వడం అలవాటు చేస్తే, ఆ పద్ధతికి పిల్లలు అలవాటు పడిపోతారని నిపుణులు చెబుతున్నారు. తాము అలిగిన, ఏడ్చిన కోరింతల ఇస్తున్నారని ఆలోచన వాళ్ల మెదడులో అలాగే ఉండిపోతుంది. ఇది భవిష్యత్తులో సమస్యగా మారుతుంది. అనుకున్నా ప్రతి వస్తువు చేతికి అందకపోతే పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఏదైనా కావాలని పిల్లలు అడిగినప్పుడు అది వారికి అవసరమా.. కాదా అని ముందుగా పెద్దవాళ్లు ఆలోచించాలి. దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటే కొనడం మంచిది.
 కొందరు తల్లిదండ్రులు పిల్లలు అడిగిందల్లా తెచ్చి ఇవ్వటం చాలా గొప్పతనంగా ఫీల్ అవుతుంటారు. అలా చేయటం వల్ల వారికి ఆ వస్తువు విలువ ఎప్పటికీ తెలియదు. తప్పని సరి ఏదైనా వస్తువును వారు కావాలనుకుంటే... పాకెట్ మనీ దాచుకుని దాన్ని కొనుక్కోమని చెప్పాలి. దానికోసం వాళ్లతో ఇంట్లో చిన్న చిన్న పనులు చేయించి, వారికి అప్పుడప్పుడు కొంతమంది మనీ ఇవ్వాలి. పిల్లలు అడిగిందల్లా ఇస్తూ వారికి గారాబం చేయకూడదు. దీనివల్ల వారు భవిష్యత్తులో మొండిగా ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల మాటలను పెడ చవిన పెట్టేసారు. పిల్లలు ఏదైనా అడుగుతున్నప్పుడు ఆ విషయాలన్నీ పేరెంట్స్ పూర్తిగా వినాలి. దానికి కొంత సమయం తీసుకోవాలి. పిల్లలు అడిగినవన్నీ అత్యవసరం కాదని అనిపించినప్పుడు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి కానీ, వారిని కోప్పడకూడదు. తరువాత కొని ఇస్తానని మృదువుగా చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: