నోరూరించే ఉసిరికాయ తురుము నిలవ పచ్చడి తయారీ విధానం..!

lakhmi saranya
నోరూరించే ఉసిరికాయ పచ్చడి ఇప్పుడైనా తిన్నారా. ఉసిరికాయ పచ్చడి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది. ఉసిరికాయ పచ్చడి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీనిని ఇష్టంగా తింటారు. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. ప్రస్తుతం మార్కెట్లో ఉసిరికాయలు విరివిగా లభిస్తున్నాయి. చాలామంది ఉసిరికాయలతో నిల్వ పచ్చడి, తోక్కు పచ్చడి పెట్టుకుంటారు. అలాగే... పప్పు, పులి హూర వంటి రెసిపీలు కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే... ఈ నిలవ పచ్చడిని రెండు విధాలుగా పెట్టుకుంటారు. చాలామంది ఉసిరికాయలను నీరుగా నూనెలో వేయించి నిల్వ పచ్చడి తయారు చేస్తారు. మరో మరో పద్ధతిలో ఉసిరికాయలను తురిమి పచ్చడి చేస్తారు. మరి...
దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉసిరికాయ తురుము పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అస్తంత నెయ్యి వేసుకుని ఈ తురుము పచ్చడితో తింటే ఎవరైనా సరే రుచికి మర్చిపోవాల్సిందే. అంతేకాదు.. ఇక్కడ చెప్పే పద్ధతిలో తయారు చేసి స్టోర్ చేసుకుంటే... దాదాపు ఏడాది కాలం పాటు నిల్వ ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం ? ఈ ఉసిరికాయ తురుము పచ్చడి ఎలా చేయాలి? దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? అనే విషయాలు ఇక్కడ చూద్దాం. ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడగండి. వాటిపై తడి లేకుండా పొడి వస్త్రంతో తుడవండి. తర్వాత ఉసిరికాయలని గ్రేటర్ సాయంతో తురుముకోండి. ఇప్పుడు స్టౌ పై కడాయి పెట్టండి.
ఇందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి దోరగా వేయించండి. ఇవి చల్లారిన తరువాత మెత్తగా పొడి చేసుకోండి. తర్వాత తాలింపు కోసం.. స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేయండి. నూనె వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోండి. తర్వాత ముందుగా ఉసిరికాయ తురుము విశ్రమాన్ని వేసి 3 నిమిషాలు వేపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే విషయం అని పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతులు పొడి, కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. అలాగే రెండు నిమ్మకాయల రసం పిండండి. ఈ పచ్చడిని ఒక గ్లాస్ జారులోకి తీసుకుని మూత పెట్టి రెండు రోజులపాటు ఊరనివ్వండి. అంతే ఆ తర్వాత పచ్చడి వేసుకుని భోజనం చేస్తే ఎంతో కమ్మగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: