ఈ తప్పులు చేయడం వల్లే ఆ సమస్యలు...! ఏం జరుగుతుందో మీరే చూడండి!!

lakhmi saranya
ఈరోజుల్లో ప్రతి ఒక్క లైఫ్ బిజీగా మారిపోయింది. ఇదివరకు ప్రతి ఒక్కరూ ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసేవారు. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవటం వల్ల అనారోగ్య సమస్యలు అధిగా వస్తున్నాయి. ఒకప్పుడు ప్రజల్లో ఫిజికల్ యాక్టివిటీస్ అధికంగా ఉండేవి, స్ట్రెస్ యాంగ్జైటిస్ వంటివి ఎక్కువగా కనిపించేవి. కానీ నేటి డిజిటల్ యుగంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. చాలామందిలో శారీరక శ్రమ తగ్గుతోంది. దీంతో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేసే జీవనశైలితో ఉబకాయం,
మధుమేహం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే విషయం తెలిసిందే. అయితే తాజా ఆధ్యాయంలో మరో కొత్త విషయం కూడా వెల్లడైంది. ఏంటంటే... నిశ్చల జీవనశైలి ముందస్తు వృద్ధాప్యానికి కూడా దారితీస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కోలరాడో బౌల్డర్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్స్ సైడ్ కు చెందిన సైంటిస్టులు కనుగొన్నారు. ఆధ్యాయంలో భాగంగా శాస్త్రవేత్తలు 28 నుంచి 50 ఏండ్లలోపు వయసు గల వారి జీవనశైలిని పరిశీలించారు. వారు డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఏయే ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారు? ఎంతసేపు కూర్చుంటున్నారు? తదితర వివరాలను సేకరించి ఎనలైజ్ చేశారు. కాగా వీరిలో ఎక్కువమంది 9 నుంచి 16 గంటలపాటు కథలకుండా ఒకే దగ్గర కూర్చుని ఉంటున్నారని, మరికొందరు వారానికి దాదాపు 60 గంటలపాటు నిశ్చల జీవన శైలిని కలిగి ఉంటున్నారని కనుగొన్నారు.
 అయితే వీరిలో 9 గంటలకు మించి ఒకే దగ్గర కూర్చునే వారిలో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవటం,గుండె జబ్బులు వంటి రిస్క్ పెరిగినట్లు పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. ఒక 7 నుంచి 8 గంటల వరకు ఒకే దగ్గర కూర్చుని పనిచేస్తున్న వారిని కూడా పరిశోధకులు రెండు గ్రూపులుగా విభజించారు. వీరిలో ఉదయం లేదా సాయంత్రం వ్యాయామాలు చేస్తున్న వారు ఒక గ్రూపు కాగా, ఎలాంటి శారీరక శ్రమ లేకుండా నిశ్చల జీవనశైలిని కలిగి ఉంటున్నవారు మరో గ్రూపు గా ఉన్నారు. కాగా ఉదయం లేదా సాయంత్రం వ్యాయామాలు చేస్తున్నవారు గంటల తరబడి ఒకే దగ్గర కూర్చుని పని చేస్తున్నప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండట్లేదని గుర్తించారు. కానీ ఎలాంటి వ్యాయామాలు లేకుండా నిశ్చల జీవనశైలి కలిగి ఉన్నవారు గంటల తరబడి కూర్చుని పనిచేయటం వల్ల వాళ్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: