వాటర్ హీటర్ వాడుతున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి?
ఒకప్పుడు వేడి నీటిని పెట్టుకోవడానికి కేవలం పోయి మీద ఒక పెద్ద పాత్రను పెట్టి అందులో నీటిని వేడి పెట్టుకునేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా హీటర్ వాడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. నేటి రోజుల్లో హీటర్ లేని ఇల్లు లేదు అనడంలో కూడా సందేహమే లేదు. అయితే ఇలా నీటిని వేడి చేసుకునేందుకు వాడుతున్న హీటర్ ఇక ఎన్నో ప్రమాదాలకు కూడా కారణం అవుతుంది. ఈ వాటర్ హీటర్ కారణంగానే ఎంతోమంది కరెంట్ షాక్ కి గురై చివరికి ప్రాణాలకు కూడా కోల్పోతున్న ఘటనలకు కూడా వెలుగులోకి వస్తున్నాయ్ అని చెప్పాలి.
ఈ క్రమంలోనే వాటర్ హీటర్ పెట్టినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. వాటర్ హీటర్ పెడుతున్న సమయంలో అల్యూమినియం బకెట్ మాత్రమే వాడాలని చెబుతున్నారు. ఇనుప బకెట్ షాక్ ఇచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక ప్లాస్టిక్ బకెట్ అయితే కరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుందట. అంతే కాకుండా స్విచ్ ఆఫ్ చేసి హీటర్ బకెట్ లో నుంచి తీసిన తర్వాతే నీళ్లు వేడి అయ్యాయో లేదో చూడాలి అంటూ సూచిస్తున్నారు. లేదంటే షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంటుందట. ఇక అంతేకాకుండా పిల్లలు తిరిగే దగ్గర వాటర్ హీటర్ వాడకపోవడమే మంచిది అంటూ సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా ఐఎస్ఐ మార్క్, షాక్ ప్రూఫ్ హీటర్ అనే కొనుగోలు చేయడం మంచిది అని చెబుతున్నారు. అంతేకాకుండా హీటింగ్ రాడ్ పూర్తిగా నీటిలో మునిగిపోయే విధంగా ఉంచాలని సూచిస్తున్నారు.