మొబైల్ తో టాయిలెట్ లోకి వెళ్తున్నారా.. అయితే ఇది మీకోసమే?

praveen
నేటి దైనందిత జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తోంది. మనిషి అవసరం కోసం మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ పరికరం ప్రస్తుతం మనిషినే మింగేస్తోంది. అవును, మొబైల్ ఫోన్ అనేది సగటు మనిషికి ఒక అడిక్షన్ లా తయారైంది. ఎంతలా అంటే... మొబైల్ లేకుండా ఎవరు ఏ పని చేయలేని పరిస్థితి వచ్చింది. మనచుట్టూ చాలామంది 24గంటలు ఫోన్ లోనే తలపెట్టి చూసేంత వ్యసనంగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే... ఫోన్ లేకపోతే ప్రపంచ ఆగిపోతుందేమో అన్నంత మాదిరి మొబైల్ ఫోన్ వ్యసనం అంతటా పెరిగిపోయింది. ఆఖరికి మొబైల్ ఫోన్ ను బాత్రూంలోకి వెళ్లేటప్పుడు కూడా తీసుకువెళ్తుంటారు అనడంలో ఆటోసయోక్తి లేదు. అలా వెళ్ళినవారు టాయిలెట్లో ఫోన్ చూస్తూ గంటల సమయం బయటకు రాకుండా గడుపుతుంటారు.
అసలు విషయం ఏమిటంటే... ఇలా చేయడం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరైతే టాయిలెట్ కి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్ తీసుకువెళ్లి ఫోన్లో చూస్తూ కూర్చుంటారో వారు ఖచ్చితంగా రోగాల బారిన పడతారని ఓ సర్వే ద్వారా తెలిసింది. టాయిలెట్లోకి ఫోన్ తీసుకు వెళ్లినప్పుడు టాయిలెట్ లో ఉండే బ్యాక్టీరియా గాలి ద్వారా మన ఫోన్ పైకి చేరుతుంది. తద్వారా చేరిన ఆ బాక్టీరియా మనం మాట్లాడుతున్నప్పుడు చేతులతో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు మన చేతుల నుంచి మన కడుపులోకి చేరుతుంది. తత్పలితంగా డయేరియా, ప్రేగు సంబంధిత వ్యాధులు, మూత్ర వ్యాధులు, మరికొన్ని అంటు వ్యాధులు వంటి తీవ్ర అనారోగ్య పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అవును, మనం రోజూ వాడే టాయిలెట్లలో మనకు తెలియకుండానే కంటికి కనిపించని బ్యాక్టీరియా ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసు? బాత్రూంలో కూర్చుని ఫోన్ మాట్లాడినప్పుడు అది మన ముక్కు, నోరు ద్వారా కడుపులోకి వెళ్తుంది. ఒక్కోసారి మలం పేగుల ద్వారా కూడా ఆ బాక్టీరియా కడుపు లోనికి చేరుకుంటుంది. ఫలితంగా రోగాల బారిన పడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా టాయిలెట్ లో కమోడ్ మీద గంటల కొద్దీ కూర్చుంటే రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మొబైల్ ఫోన్ ను వినియోగించాలనుకునేవారు అతిగా వినియోగించడం ప్రమాదం అనే విషయాన్ని గుర్తించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: