ఎట్టి పరిస్థితిలో అత్తగారితో అల్లుడు ఈ విషయాలను అసలు మాట్లాడకూడదు..!

Divya
సాధారణంగా తల్లిదండ్రులు తమ కూతురికి వివాహం చేసి పంపించే సమయంలో అల్లుడికి తన కూతుర్ని బాగా చూసుకోవాలని చెబుతూ ఉంటారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు కూడా తమ అల్లుడిని కొడుకు లాగానే భావిస్తూ తమ కుటుంబంలోని అన్ని విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటారు. అందుకే అల్లుడుగా కూడా అత్తవారి ఇంట మర్యాద నిలబెట్టడం అతని కర్తవ్యం అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా బంధువుల దగ్గర కూడా ఎలాంటి మాటలు అనకూడదు.

అయితే అత్తతో అల్లుడు చెప్పకూడని విషయాలు ఏమిటంటే.. మీ కూతురికి ఏ పని చేతకాదని అసలు చెప్పకూడదట.. ఇలా చెప్పడం వల్ల అత్తగారి మనసు బాధపడుతుందట.

అలాగే అత్తవారి ఇంట ఆచారాలను కూడా ఇప్పుడు ప్రశ్నించకూడదు ఈ ఆచారాలను విమర్శిస్తే గొడవలు కూడా జరుగుతాయట.

అలాగే కూతుర్ని సరిగ్గా పెంచడం రాదని అత్తగారిని ప్రశ్నించకూడదు ఇది అవమానకరంగా వారు ఫీలవుతారు. అంతేకాకుండా ఇది బంధువుల దగ్గర కూడా చాలా అవమానకరంగా ఫీల్ అవుతారట.

అలాగే వృద్ధ వయసులో ఉన్న వారిని ఆప్యాయంగా మాట్లాడిస్తూ ఉండాలి వారిని మార్చమని అసలు చెప్పకూడదట .ముఖ్యంగా మనం చేసే పని తీరు కూడా వారి దగ్గర మార్చుకోవాల్సి ఉంటుంది.

పిల్లల్ని చూసుకోవడం మీకు చేతకాదనే విషయాన్ని అత్త గారితో అసలు అనకూడదట ఇది వారి అనుభవాన్ని సైతం దెబ్బతీయటమే కాకుండా అగౌరవపరిచినట్లుగా ఉంటుందట.

అలాగే మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలనే పదం ప్రతిసారి చెప్పినప్పటికీ కూడా ఇది వారి యొక్క బలహీనతను ఎత్తిచూపుతున్నట్లుగా అత్తగారు భావిస్తారట..

ఒక తల్లికి కూతురు ఎంత ఇష్టమో అల్లుడు కూడా అంతే ఇష్టము అందుకే అత్తగారింటికి ఎక్కువగా రాలేమనే విషయాన్ని చెప్పకూడదు.. ఈ విషయం మారిన బాధపెడుతుందట.

ఇదే కాకుండా చిన్న చిన్న వాటికి గొడవలు పడటం.. అలాగే డబ్బు తెమ్మని అత్తవారిని అడగమని చెప్పడం వంటి వాటిని కూడా మాట్లాడకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: