డయాబెటిస్ స్టాప్ బాధిస్తున్నారా?.. అయితే వింటర్ లో ఈ జాగ్రత్తలను తీసుకోండి..!

lakhmi saranya
ఈరోజుల్లో చాలామందికి డయాబెటిస్ సమస్య మరింతగా పెరిగిపోతుంది. చిన్నపిల్లలకి కూడా డయాబెటిస్ సమస్య వస్తుంది. మీరు డయాబెటిస్తో ఇబ్బంది పడుతున్నారా? అయితే చలికాలంలో జర జాగ్రత్త అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వాతావరణం చల్లగా మారడం వల్ల రక్త ప్రసరణ పై ప్రభావం పడుతుందని, ఇన్ఫెక్షన్లు, వ్యాధుల రిస్క్ పెరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా చలికి భయపడి కొందరు వ్యాయామాలు చేయకపోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలా జరగకుండదంటే కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవేంటో చూద్దాం. డయాబెటిస్ పే షెంట్లు శీతాకాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి.
అందుకోసం మందంగా ఉండే ఉన్ని దుస్తులు ధరించడం, చల్లటి గాలికి గురికాకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే డయాబెటీస్ కోసం వాడే మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలి. అవి చల్లటి వాతావరణానికి గురయ్యే ప్రదేశంలో పెట్టకూడదంటున్నారు నిపుణులు. ఇంటర్ లో వెదర్ కూల్ గా ఉండటం వల్ల చాలామంది వ్యాయామాలు చేయడానికి వెనకాడుతుంటారు. కానీ షుగర్ పే షెంట్లు అలా చేస్తే హెల్త్ పరమైన ఇబ్బందులు వస్తాయి. రక్త ప్రసరణలో ప్రతికూల మార్పులు రావచ్చు.
కాబట్టి తప్పకుండా వాకింగ్, రన్నింగ్ వంటివి చెయ్యాలి. బయటకి వెళ్లలేకపోతే ఇంట్లోనే జుంబా , యోగ వంటి ఇండోర్ర్ వ్యాయామాలు చేయాలని. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు వింటర్ లో ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు రెగ్యులర్ డైట్ లో ఉండేలా చూసుకోవాలి. వెజిటేబుల్ సూప్ లు, నట్స్ వంటివి తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని, బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే జలుబు, జ్వరం వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్ గా బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడం, బాడీని హైడ్రేట్ గా ఉంచుకోవడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి షుగర్ ఉన్నవారు ఈ విధంగా చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: