30 ఏళ్ల తరువాత పింపుల్స్ వస్తున్నాయా.. అయితే కారణం ఇదే కావచ్చు ..!
వీటినే హార్మోనల్ యాక్నె అంటారు. అయితే ఈ వయసులో మొటిమలు కావడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కొన్నిసార్లు మహిళల్లో ఈస్ట్రోజన్, ఇతర హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కాకపోవటం కారణంగా హెచ్చుతగ్గులు జరుగుతాయి. దింతో స్కిన్ పై పింపుల్స్ వస్తాయి. ఈ క్రమంలో మీరు గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు తీసుకోకూడదు. ఆవు పాలు, చక్కెర వంటివి మొటిమల సమస్యను పెంచుతాయి. శారీరకంగా ఒత్తిడికి లోనైతే కూడా రోగనిరోధక శక్తి బలహీనపడి...
పింపుల్స్ వస్తాయంటున్నారు నిపుణులు. అలాగే డిహైడ్రేషన్, నిద్రలేమి, అనారోగ్యం, కాలుష్యం కారణంగా కూడా పింపుల్స్ సమస్య వస్తుంది. కాగా పింపుల్స్ కు చెక్ పెట్టాలంటే ఆకుపచ్చ కూరగాయలు, కాయధాన్యాలు వంటివి తీసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసిన ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. చక్కెరలు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. వీలైనంత వరకు వాటర్ ఎక్కువగా తాగాలి. హార్మోన్ల సమతుల్యత వంటి సమస్యలను తగ్గించుకోవడానికి వ్యాయామాలు చేయాలి. కాబట్టి వీలైనంతవరకు ఈ విధంగా ట్రై చేస్తే పింపుల్స్ వెంటనే తగ్గిపోతాయి. మీ చర్మం అందంగా కనిపిస్తుంది. రోజుకి మూడు లీటర్లు నీళ్లు తాగటం బాడీకి మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నీళ్లని ఎక్కువగా తాగండి.