పులిపిర్లతో విసిగిపోయారా.. ఇలా చెక్ పెట్టండి..?
అయితే మన వంటింట్లో దొరికేటువంటి కొన్నిటిని ఉపయోగించడం వల్ల పులిపిర్లను తొలగించుకోవచ్చట. ఇలా పులిపిర్లను తొలగించడానికి ట్రీ ఆయిల్ అనేది బాగా ఉపయోగపడుతుందట. దీనిని పులిపిర్ల కోసమే ప్రత్యేకంగా తయారు చేశారట.ముందుగా ఈ నూనెను పులిపిర్లు ఉన్నచోట పట్టి ఉంచి.. ఆ తర్వాత ఉదయం లేచి చల్లని నీటితో కడగడం వల్ల అవి పొక్కులుగా మారిపోతాయట.
మరొక పద్ధతి ఏమిటంటే బేకింగ్ సోడాలోకి కాస్త ఆముదాన్ని వేసి రెండిటిని కలిపిన మిశ్రమాన్ని పులిపిర్ల వద్ద ఉంచితే పులిపిర్ల నెమ్మదిగా రాలిపోయే అవకాశం ఉంటుందట.
మన వంటింట్లో దొరికే లవంగం, నిమ్మకాయ రసాన్ని బాగా చూర్ణం చేసి పులిపిర్ల మీద ఉంచితే నెమ్మదిగా తగ్గుముఖం పట్టి రాలిపోతాయట.
మనం తినేటువంటి అరటిపండు తొక్కను పారి వేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి చర్మం నల్లగా లేదా పులిపిర్లు ఉన్నచోట తిట్టడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే పులిపిర్లు ఉన్నచోట అరటి తొక్కను నిమ్మకాయ రసంను కాస్త పిండి పులిపిర్లు ఉన్నచోట అతికించడం వల్ల పొక్కులుగా మారి రాలిపోతాయట.
మరొక పద్ధతి ఏమిటంటే ఉల్లిపాయను తీసుకొని కాస్త నీటిలో నానబెట్టి ఆ తర్వాత ఆ నీటిని చర్మ భాగాల పైన బాగా రాసుకొని ఏదైనా గుడ్డతో పులిపిర్ల మీద కప్పి వేసి ఉదయం కాస్త గోరువెచ్చని నీటితో కడగడం వల్ల పులిపిర్లు రాలిపోతాయట.
అయితే పులిపిర్లు లేని వారు కూడా ఇందులో కొన్ని పద్ధతులను ఉపయోగిస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అయితే స్కిన్ ఎలర్జీ ఉన్నవారు వీటిని ఉపయోగించకపోవడం ఉత్తమం.