బేజా ఫ్రై తింటే ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

frame బేజా ఫ్రై తింటే ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

lakhmi saranya
మేక బ్రెయిన్ కర్రీ తింటే అసలు వదిలిపెట్టరు. ఈ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మేకప్ బ్రెయిన్ తినటం ఆరోగ్యానికి కూడా మంచిది. బేజా ఫ్రై అంటే అందరికీ తెలిసింది. మేక లేదా గొర్రె మెదడును వేయించుకుని తినేదాన్ని బేజా ఫ్రై అంటారు. బేజా ఫ్రై చాలా టేస్టీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రుచికరమైన వంటకాలలో ఇది ఒకటి. అయితే చాలామంది మేక మెదడు టేస్టీగా ఉంటుందని తింటారు కానీ దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
 మేక మెదడులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మేక మెదడులో ప్రోటీన్, ఐరన్ అధికంగా ఉంటాయి. పోషకాలు దట్టంగా ఉంటాయి. బేజా ఫ్రై స్మెల్ లోహ రుచిని కలిగి ఉంటుంది. ఒకవేళ మీకు ఆ రుచి నచ్చకపోతే సుగంధ ద్రవ్యాలు మసాలాలు బాగా వేసి ఫ్రై చేసుకుని తినొచ్చు. బేజా ఫ్రైలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండటమే కాకుండా ఆంటీ ఆక్సిడెంట్లు దట్టంగా ఉంటాయి. కాగా అప్పుడప్పుడు తింటూ ఉంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫ్రాన్స్ లో దీన్ని బాగా తింటుంటారట.
గొర్రె, మేక మెదడుకు ఖరీదు కూడా బాగానే ఉంటుంది. ఫ్రాన్స్ ప్రజలు బట్టర్ లో డీప్ ఫ్రై చేసి ఎంతో ఇష్టంగా తింటార. మేక మెదడు కేవలం 100 గ్రాములు ఉంటుంది. దీన్ని దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కువగా తింటుంటారు. ముంబైలో కూడా కొన్ని ప్రాంతాల వారు మసాలా కూరల వండుకుని తింటారు. అయితే వంట చేయడానికి ముందు మేక, గొర్రె మెదడును క్లీన్ గా కడగండి. తరువాత వండాలి. మేక మెదడులో ఎలాంటి విషాలు ఉండవు కనుక ఎలాంటి సందేహం లేకుండా తినవచ్చు. బేజా ఫ్రై మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు. ఎందుకంటే దీనిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. అలాగే ఎక్కువగా సంతృప్తి అర్థం కలిగి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: