వివాహం జరిగేటప్పుడు అమ్మాయి కంటే అబ్బాయి పెద్దవాడు అయి ఉండాలి అని అలా ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. అలా కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
వయసులో పెద్ద అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వల్ల అమ్మాయికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఒకటి అబ్బాయి తన కంటే పెద్దవాడు కాబట్టి కొంత ఎక్కువ అనుభవాన్ని కలిగి ఉంటాడు. వచ్చే సమస్యను అమ్మాయి కంటే ముందే పసి గట్టి దానికి పరిష్కారాన్ని వెతికే అవకాశం ఉంటుంది. అలా ఏదైనా సమస్య వచ్చినా కూడా అమ్మాయి కంటే అబ్బాయి కాస్త ముందు గానే దానికి పరిష్కారాన్ని ఆలోచించి సమస్య నుండి బయటపడే అవకాశం చాలా వరకు ఉంటుంది.
అలాగే చాలా అధ్యయనాల ప్రకారం సమాన వయస్సు ఉన్న జంట కంటే కూడా వయస్సు తేడా కాస్త ఎక్కువగా ఉన్న జంటలే చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నట్లు చెబుతున్నాయి. ఇక వయసు ఎక్కువ ఉన్న అబ్బాయి అప్పటికే లైఫ్ లో సెట్ అయి ఉంటాడు. దాదాపుగా ఏదో జాబ్ చేస్తూ ఉండడం లైఫ్ పట్ల అతనికి ఎంతో అవగాహన ఉండడం జరుగుతుంది. అలా కాకుండా ఒకే వయసు ఉన్న ఇద్దరు పెళ్లి చేసుకోవడం వల్ల వారికి జాబ్ లేనట్లయితే ఏదైనా ఒక పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలు ఎదురైనట్లయితే వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అందుకే చాలా మంది పెళ్లి విషయంలో అబ్బాయి వయసు కాస్త ఎక్కువ ఉండాలి అని అమ్మాయి వయసు కాస్త తక్కువ ఉండాలి అని సూచనలను ఇస్తూ ఉంటారు. ఇక ఒకే వయసు ఉన్న జంటల కంటే వయసు తేడా కాస్త ఎక్కువ ఉన్న జంటలు ఎక్కువ శాతం సంతోషాలతో ఉండడంతో వయసు ఎక్కువ ఉన్న అబ్బాయిలనే పెళ్లి చేసుకోవాలి అని సూచనలు కూడా పెరుగుతూ వస్తున్నాయి.