గ్యాస్ దగ్గర మీరు చేస్తున్న మిస్టేక్స్ ఇవే.... ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..!

lakhmi saranya
చాలామంది గ్యాస్ స్టవ్ దగ్గర అజాగ్రత్తగా ఉంటారు. కానీ అలా అ జాగ్రత్తగా ఉండటం వల్ల ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. గ్యాస్ దగ్గర ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్యాస్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గ్యాస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ స్టవ్ లు దాదాపు ప్రతి భారతీయ వంటగదికి వృదాయం. కానీ జాగ్రత్తగా ఉండకపోతే పుడ్ తింటూ యమ్మీ అని మనం అయ్యో అనాల్సి వస్తుంది. అందుకే వంట గదిని, ఇంటిని, ఇంటి సభ్యులను సురక్షితంగా ఉంచే కొన్ని టిప్స్ అందిస్తున్నారు నిపుణులు. వంట చేసిన తరువాత హడావిడిలో బర్నర్ ఆఫ్ చేయటం మర్చిపోవచ్చు. కాబట్టి ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయటం ముఖ్యం.
 స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడు బర్నర్ వెలగకపోతే విస్మరించకూడదు. అలా జరిగితే.. దాన్ని ASAP ఆఫ్ చేసి విండోను తెరిచి, మళ్లీ ప్రయత్నించే ముందు కొంచెం వేచి ఉండండి. భద్రత ముఖ్యం. సుబ్రం చేయటం ఇష్టముండదని తెలుసు కానీ... మురికితో కూడిన పొయ్యి మనం అనుకున్నదానికంటే ప్రమాదకరం. ఆహార కాణాలు, గ్రీజు బర్నర్ ను మూసుకుపోయేలా చేస్తాయి. సంభావ్య గ్యాస్ లీక్ లకు దారితీస్తాయి. అందుకే ప్రతిసారి గ్యాస్ స్టవ్ వినియోగించక తడి గుడ్డతో త్వరితగతిన తుడిచివేయడం మంచిది. మొండి మరకలు ఉన్నట్లయితే..కొద్దిగా సబ్బు, స్క్రబ్ తో శుభ్రం చేయండి.
మంటలు అంటుకునే వస్తువులు ఏవి స్టవ్ దగ్గర పెట్టకూడదు. ప్లాస్టిక్ కవర్లు, చెక్క చెంచాలు, టవల్స్, ముందు సీసాలు దరిదాపుల్లో ఉంచకూడదు. అన్ని వస్తువులను మంటలకు దూరంగా ఉంచండి. వంట చేసే వ్యక్తి మాత్రమే కాదు...ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఈ నియమాన్ని ఫాలో కావాలి. వంట చేసేటప్పుడు వదులైన దుస్తులు ధరించకూడదు. ఇవి మంటలు అంటుకునేందుకు కారణం కావచ్చు. కాబట్టి మీకు సరిగ్గా సెట్ అయ్యే దుస్తులను వేసుకోండి. పాలీస్టర్, సింథటిక్ క్లాత్స్ కు ఫ్యాబ్రిక్ లను ధరించవద్దు. పొడవాటి జుట్టు ఉంటే...మంట ప్రారంభించే ముందు దానిని బన్ లేదా పొనిటైల్ లో కట్టుకోండి. జుట్టు + అగ్ని కాంబో అస్సలు మంచిది కాదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: